NEWS

BAN vs PAK : మరింతగా దిగజారిపోయిన పాకిస్తాన్.. బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి

PC : ICC BAN vs PAK : పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket team) పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇటీవలె ముగిసిన టి20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024)లో పసికూన అమెరికా చేతిలో ఓడి గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన కంటే బలహీనమైన జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అది కూడా టెస్టు మ్యాచ్ లో. టి20, వన్డేల్లో పసికూన జట్లు పెద్ద జట్లకు షాక్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. అయితే టెస్టుల్లో ఇటువంటివి చాలా అరుదుగా ఉంటాయి. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌ను పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడించింది. మొత్తంగా మూడు టెస్టుల సిరీస్‌లో బంగ్లా ఘనంగా బోణీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 448 పరుగులకు డిక్లేర్ చేసింది. రిజ్వాన్, సౌద్ షకీల్ లు సెంచరీలతో చెలరేగారు. బాబర్ ఆజమ్ డకౌట్ అయ్యాడు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 565 పరుగులకు ఆలౌటైంది. రహీం 191 పరుగులతో భారీ సెంచరీ సాధించాడు. ఫలితంగా బంగ్లాదేశ్ కు 117 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. In a thrilling match that went right to the final day, Bangladesh snatched a maiden Test win over Pakistan in Rawalpindi 👊 #WTC25 | #PAKvBAN | Read on 👇 ఇక రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. రిజ్వాన్ 51 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ 4 వికెట్లు సాధించగా.. షకీబుల్ హసన్ 3 వికెట్లతో మెరిశాడు. ఫలితంగా పాకిస్తాన్ కేవలం 30 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మధ్య ఉంచగలిగింది. అనంతరం బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ కు ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఇక బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ పై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.