NEWS

Shree Chakra Meru Temple: ఈ గుడికి ఒక్కసారి వెలితే.. 10 లక్షల సార్లు పూజ చేసినంత పుణ్యం!

ఈ గుడికి ఒక్కసారి వెలితే.. 10 లక్షల సార్లు పూజ చేసినంత పుణ్యం! 1000 శ్రీచక్ర మెరువుల ఆలయం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురమయ్యపేట గ్రామ పరిధిలో వెలసి ఉంది. లలితా సహస్ర నామాలతో ఈ 1000 శ్రీచక్రాల మేరువులు గల ఆలయాన్నిశ్రీవిద్యోపాసకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మనిర్మించారు. ఈ ఆలయంలో మొత్తం 4 బ్లాకులుగా విభజించి ఒక్కొక్క బ్లాకులో సుమారు 250 శ్రీచక్రాలుగా విభజించి మధ్యలో 9 అడుగులు ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో మహా మేరువు నిర్మించారు.ఇక్కడ గల మహా మేరువు క్రింద 40 అడుగుల లోతున ఒక గోతిని త్రవ్వి ఒక యంత్రాన్ని స్థాపించారు. ఈ రాజ రాజేశ్వరి దేవి ఆలయంలో ఉన్న 999 మేరువులు క్రింద ఒక రాగి తీగను అమర్చి ఆ తీగలు అన్ని మహా మేరువు క్రిందకి తీసుకువచ్చి కలపడం జరిగింది. ఇక్కడ ఒక భక్తుడు ఓకే సారి శ్రీచక్ర మేరువుకు పూజ చేసినావెయ్యి మేరువులకు పూజ చేసిన ఫలితం పొందుతారు. ఒకేసారి 1000 మంది భక్తులు పూజ చేస్తే ప్రతి భక్తుడు 10లక్షల సార్లు పూజ చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి ఇక్కడ సహస్ర శ్రీ చక్ర మెరువులకు కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలలో పాల్గొనేందుకుశ్రీకాకుళం జిల్లా నుండే కాకుండా సుదూర ప్రాంతాలు నుండి కూడా చాలా మంది భక్తులు ఈ కుంకుమార్చన లో పాల్గొంటారు. సాధారణంగా శ్రీ చక్ర పూజను మంత్రోచ్చారణతో చేసే అమ్మవారిని అనుష్ఠాన పరిచి చేసే ఈ పూజను తేజోమూర్తుల బాలభాస్కరశర్మఅన్ని వర్గాల ప్రజలకు అమ్మవారి ఉపాసన అవకాశాన్ని కల్పించాలనే మహత్తర సంకల్పంతో ఈ సహస్ర శ్రీ చక్ర మెరువుల ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి సంకల్పంతో మాత్రమే ఈ ఆలయాన్ని నిర్మించి నట్టుగా బాలభాస్కరశర్మ అన్నారు.ఈ ఆలయం ప్రారంభోత్సవానికి శ్రీ కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామిస్వయంగా వచ్చి ఎంతటి బృహత్ కార్యం చేసిన తేజోమూర్తుల బాలభాస్కరశర్మ ధన్యుడని నడిచే శివుడని ఆయన అన్నారు. సహస్ర శ్రీచక్ర మేరువులు గల శ్రీ రాజ రాజేశ్వరి దేవి ఆలయం శ్రీకాకుళం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నుండి 5కిలో మీటర్లు దూరంలో నేషనల్ హైవే 16 కు ఒక కిలో మీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయంలో 5ఉప ఆలయాలు ఉన్నాయి.అవి శివాలయం, విఘ్నేశ్వర స్వామిఆలయం, సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ రాముని ఆలయం, సాయిబాబా మందిరం ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రావణ మాసంలో ప్రతి రోజు భక్తులచే సహస్ర మేరువులకు కుంకుమ పూజలు జరగడం విశేషం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.