అయ్యప్ప మాల అంటే తేలియని ఓ వ్యక్తి 36 యేళ్లుగా అయ్యప్ప మాల వేస్తున్నారు. అయ్యప్ప మాల అంటే తెలియని ఓ వ్యక్తి 36 యేళ్లుగా అయ్యప్ప మాల వేస్తున్నారు. దేవుడు అంటే భక్తి లేదు. దేవుడు అంటే భయం లేదు. తనకు తెలిసిందల్లా కొట్లాటలే, గొడవలు పడనిదే రోజు గడిచేది కాదు. కానీ ఒక రోజు ఇద్దరు నల్ల బట్టలు వేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ నల్ల బట్టల వెనుక ఉన్న అంతర్యాన్ని తెలుసుకున్నారు. 1989 నుంచి అయ్యప్ప స్వామి మాల ధరించి 36 యేళ్లుగా అందరికీ ఆదర్శంగా నిలిచారు గురు స్వామి కుమార్ గల్లి స్వామి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్ గల్లికి చెందిన స్వామి. తన దినచర్య కొట్లాటలతోనే జీవనం సాగుతుంది. అయితే 1988 లో నిజామాబాద్ నగరంలో ఇద్దరు స్వాములు నల్ల బట్టలు వేసుకుని కనిపించారు. వారిని చూసి ఎందుకు నల్ల బట్టలు వేసుకున్నారని తెలుసుకున్నారు. ఆ నల్ల బట్టల్లో ఉన్నది, గంగాధర్ స్వామి, అయన కుమారుడు ఇద్దరూ అయ్యప్ప మాల వేసుకున్నారు. వారి నుంచి అయ్యప్ప గురించి తెలుసుకుని 1989లో కపిల హోటల్ శివ శంకర్ స్వామి వద్ద మొదటి సారి కుమార్ గల్లి స్వామి అయ్యప్ప మాల వేసుకున్నారు. ఆనాటి నుంచి ఇనాటి వరకు 36 యేళ్లుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నానని గురు స్వామి కుమార్ గల్లి స్వామి చెబుతున్నారు. 36 ఏళ్ల క్రితం నేను ఒక రౌడీలా ఉండేవాణ్ణి. నిజామాబాదులో ఇద్దరు స్వాములు నల్ల బట్టలు వేసుకొని తిరిగేవారు. ఎందుకోసం నల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నారని ఆలోచించాను. గంగాధర్ స్వామి అతని కొడుకు ఇద్దరూ కూడా అయ్యప్ప మాల వేసుకుని తిరుగుతున్నారు. అప్పుడు నాకు అయ్యప్ప అంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు. ఎప్పుడూ కొట్లాటలోనే ఉండేవాణ్ణి. 1989లో నేను మొదటిసారి మాల వేశాను. అప్పుడు నాకు అయ్యప్ప అంటే ఏమిటి… అయ్యప్పను నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. మా గురుస్వామి కపిల హోటల్ శివ శంకర్ గురుస్వామి మాకు మాల వేశారు. శబరిమల యాత్ర కూడా మమ్మల్ని తీసుకువెళ్లారు. తర్వాత గుండయ్య గురుస్వామి నాకు మాలలు వేశారు. నేను 36 ఏళ్లుగా ఈ మాల వేయడానికి ముఖ్య కారణం అయ్యప్ప.. నేను అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చారు. నేను ఏదైతే కోరుకున్నానో స్వామి అవన్నీ నెరవేర్చారు. మాల వేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాను, భార్య, పిల్లలతో సుఖ సంతోషాలతో ఉన్నాను. స్వామిని నమ్మి మాల వేసుకుంటే మన సంకల్పం బలంగా ఉంటే కచ్చితంగా నెరవేరుతుందని గురు స్వామి కుమార్ గల్లి స్వామి తెలిపారు. None
Popular Tags:
Share This Post:
EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకపై మరింత బెనిఫిట్!
- by Sarkai Info
- December 24, 2024
What’s New
Postal : మహిళలకు పోస్టాఫీస్‌లో మతిపోయే స్కీమ్.. రెండు లక్షలు కడితే..!
- By Sarkai Info
- December 24, 2024
Spotlight
Today’s Hot
64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..
- By Sarkai Info
- December 20, 2024
Featured News
కేటీఆర్‌పై కేసు నమోదు.. పార్టీ శ్రేణులు ఏమంటున్నారో మీరే వినండి..
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Lay Offs: ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగులకు షాక్!.. భారీగా లేఆఫ్స్.. కోతలే కోతలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.