నవనందులు ఒకప్పుడు నందికొట్కూరు చుట్టుపక్కల 9 నందులను ప్రతిష్టించిన జనమే మహారాజ ఒకప్పుడు నవనందులుగా పిలువబడే ప్రాంతం ఇప్పుడు మరొక పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ 9 నందులను ఆ ఊరు చుట్టుపక్కల రాజుల కాలం పరిపాలన రోజులలో భాగంగా జనమే మహారాజు అనే రాజు ఈ ప్రాంతం చుట్టుపక్కల 9 నందులను ప్రతిష్టించారు. ఆ తొమ్మిది నందులలో ఇప్పటికీ 4 నందులు అలాగే ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఆ ప్రాంతం ఎక్కడుందో మన లోకల్ 18 ద్వారా తెలుసుకుందాం.. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణాన్ని ఒకప్పుడు నవనందులుగా పిలువబడే ప్రాంతంగా చెప్పవచ్చును. పూర్వం నాటి ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. జనమే మహారాజు అనే రాజు పరిపాలనలో నందికొట్కూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా 9 నందులను ప్రతిష్టించారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని నవనందులుగా పిలువబడేది. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నవనందులుగా పిలువబడే ప్రాంతాన్ని నందికొట్కూరుగా పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రాంతమంతా రాజులు పరిపాలించిన ప్రాంతంగా చెప్పవచ్చును. ఓకే రాయిపై నందిని ఏర్పరిచారు. నందికి ముందు భాగంలో ఉన్న రాయికి చిన్న శివుని బొమ్మ ఆకారం ఏర్పరిచారు. అనగా ఎక్కడైనా నందిని సపరేట్‌గా శిల్పంగా ఏర్పరిచి ఉంటారు. అయినప్పటికీ జనమే మహారాజు ఏర్పాటుచేసిన 9 నందులు రాయి తోటే పూర్తిగా అటాచ్మెంట్ కలిగి ఉండటం విశేషంగా చెప్పవచ్చునని శ్రీ నవనంది హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్ లోకల్ 18తో తెలిపారు. ఈ ప్రాంతానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ నందికొట్కూరు డెవలప్‌మెంట్‌లో భాగంగా ఒక కమిటీ అయితే చాలా సంవత్సరాల నుంచి నందికొట్కూరు ప్రాంతాన్ని డెవలప్‌మెంట్‌లో భాగంగా చాలా పురాతనమైన గుళ్లను పునర్నిర్మించడం జరిగింది. అదేవిధంగానే ఈ కమిటీ సభ్యులు అందరూ ఈ తొమ్మిది నవనందులలో కొన్ని నందులు పూర్తిగా తొలగించారు. ఆ తొలగించినటువంటి నందులను మరల పునర్నిర్మాణం చేపట్టే విధంగా తగు చర్యలు తీసుకుని తిరిగి నందుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ నందికొట్కూరు ప్రాంతానికి చాలా చరిత్ర ఉందని ప్రతి ఒక్కరూ చెబుతూ వస్తూ ఉంటారు. నందికొట్కూరు పట్టణంలో చాలా సంవత్సరాలకు సంబంధించిన రాజుల కాలంలో నిర్మించిన గుళ్ళు ఉండటం విశేషం. శాతవాహనుల కాలం నాటి ప్రాంతంగా మనం చెప్పవచ్చును. ఈ పూర్తి అభివృద్ధి కార్యక్రమం అంతా నందికొట్కూరు ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తిగా తగు బాధ్యతలను తీసుకొని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారని శ్రీ నవనంది హై స్కూల్ ప్రిన్సిపాల్, వి. శ్రీధర్ లోకల్ 18 ద్వారా తెలియజేశారు. None
Popular Tags:
Share This Post:
EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకపై మరింత బెనిఫిట్!
- by Sarkai Info
- December 24, 2024
What’s New
Postal : మహిళలకు పోస్టాఫీస్‌లో మతిపోయే స్కీమ్.. రెండు లక్షలు కడితే..!
- By Sarkai Info
- December 24, 2024
Spotlight
Today’s Hot
64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..
- By Sarkai Info
- December 20, 2024
Featured News
కేటీఆర్‌పై కేసు నమోదు.. పార్టీ శ్రేణులు ఏమంటున్నారో మీరే వినండి..
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Lay Offs: ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగులకు షాక్!.. భారీగా లేఆఫ్స్.. కోతలే కోతలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.