NEWS

Fake Adidas Shoes: అడిడాస్ షూస్ కొంటున్నారా? ఫేక్, ఒరిజినల్ తేడాలు ఇలా తెలుసుకోండి!

PC : X Fake Adidas Shoes: ఈ రోజుల్లో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా భయమేస్తోంది. కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టు కేటుగాళ్లు ప్రతి వస్తువుకి నకిలీలు తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ముఖ్యంగా బ్రాండ్ షూస్‌కు కాపీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ కొనుగోలుదారులను మోసగిస్తున్నారు. వాటిలో అడిడాస్ (Adidas) బ్రాండ్ ఒకటి. అడిడాస్ కంపెనీ నుంచి ఒరిజినల్ కంటే నకిలీ షూస్‌ ఎక్కువగా దొరుకుతాయి. ఈ ఫేక్‌వి కొని మోసపోకుండా ఉండాలంటే కొన్ని విషయాలు గమనించాలి. స్టిచ్చింగ్, మెటీరియల్, ట్యాగ్, లోగో చెక్ చేయాలి. ఒరిజినల్ షూలు చాలా బాగా తయారై ఉంటాయి. స్టిచింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మెటీరియల్ క్వాలిటీగా కనిపిస్తుంది. అలాగే సెల్లర్ మంచి షూస్ అమ్ముతున్నాడా లేదా అనేది రేటింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అడిడాస్ స్టోర్‌లో కాకుండా మరో చోట కొనాలని అనుకుంటుంటే జాగ్రత్త పడాలి, ఇంకా ఫేక్, ఒరిజినల్ అడిడాస్ మధ్య తేడాలు తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. అవేవో చూద్దాం. అడిడాస్ బ్రాండ్ మార్కింగ్ ఒరిజినల్ అడిడాస్ షూలో “Adidas ®” అని చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. ఫేక్ షూలలో ఈ పేరు చాలా చిన్నగా ఉంటుంది లేదా “Adidas” అనే పదానికి “®” గుర్తు చాలా దగ్గరగా ఉంటుంది. ఒరిజినల్ అడిడాస్ లోగో చాలా క్లియర్, బోల్డ్‌గా కనిపిస్తుంది. లైన్లు చాలా బాగా కనిపిస్తాయి. ఫేక్ షూలలో లోగో అస్పష్టంగా లేదా తప్పుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ చాలా అడిడాస్ షూలు ఇండోనేషియాలో తయారవుతాయి. ఒరిజినల్ అడిడాస్ షూలో షూ సైజు ఉన్న ట్యాగ్‌లో “మేడ్ ఇన్ ఇండోనేషియా” అని స్పష్టంగా, బోల్డ్ లెటర్స్‌లో రాసి ఉంటుంది. కానీ, నకిలీ షూలలో ఇది చాలా చిన్న, అస్పష్టంగా రాసి ఉంటుంది. అలాగే, ఒరిజినల్ షూలో “US UK FR JP CHN” అని కూడా స్పష్టంగా రాసి ఉంటుంది. ఇవి వేర్వేరు దేశాల సైజులను సూచిస్తాయి. కానీ, నకిలీ షూలలో ఈ వివరాలు కూడా అస్పష్టంగా ఉంటాయి. మెటీరియల్ అసలు అడిడాస్ షూలు మంచి నాణ్యత గల మెటీరియల్‌తో తయారవుతాయి. అందుకే చాలా బలంగా, మన్నికగా ఉంటాయి. కానీ నకిలీ షూల క్వాలిటీ పూర్ మెటీరియల్‌తో తయారవుతాయి. అందుకే చాలా తేలికగా ఉంటాయి. స్టిచ్చింగ్ ఒరిజినల్ అడిడాస్ షూలలో స్టిచ్చింగ్ చాలా సరిగ్గా, సమాన దూరంలో ఉంటాయి. ముఖ్యంగా షూ పైభాగంలోని వంపు తిరిగిన చోట స్టిచ్చింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. కానీ ఫేక్ షూలలో ఈ స్టిచ్చింగ్ అంత సరిగ్గా ఉండవు. అవి కొంచెం వంకర తిరిగి ఉండొచ్చు లేదా సమాన దూరంలో లేకపోవచ్చు. అక్కడ కొనకూడదు అడిడాస్ షూలు కొనాలంటే, నమ్మకమైన దుకాణాలలోనే కొనాలి. అడిడాస్ అఫీషియల్లీ అథారైజ్డ్‌ స్టోర్స్‌ లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఉన్న దుకాణాలలో కొనాలి. ఎవరికీ తెలియని చిన్న దుకాణాలలో ఆన్‌లైన్‌లో ఎవరైనా అమ్ముతున్నారని చెప్పి కొనకూడదు, ముఖ్యంగా ఆక్షన్ సైట్లు లేదా సోషల్ మీడియాలో. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.