NEWS

Gukesh : ఈ చెస్ నాట్యం చూశారా? గుకేశ్ విశ్వవిజేతగా ఎలా నిలిచాడో కళ్లకు కట్టినట్లు చూపించారు

PC : Instagram Gukesh : ప్రస్తుతం దేశంలో డి. గుకేశ్ పేరు మార్మోగిపోతుంది. సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ లో చాంపియన్ గా నిలిచిన గుకేశ్ భారత్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. 18 ఏళ్ల వయసులోనే చెస్ లో విశ్వవిజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. డింగ్ లిరెన్ ను ఓడించిన గుకేశ్ ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో విశ్వవిజేతగా నిలిచాడు. చెస్ చాంపియన్ ను నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా గుకేశ్ చరిత్రకు ఎక్కాడు. ఈ క్రమంలో గుకేశ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు కళాకారిణులు వినూత్న రీతిలో గుకేశ్ కు అభినందనలు తెలిపారు. డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య జరిగిన చాంపియన్ షిప్ ఫైట్ ను తమ నాట్యం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. కథక్ కళాకారిణులు అనుష్క చందక్, మైత్రేయి నిర్గుణ్ చేసిన ఈ నాట్య ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చెస్ చాంపియన్ షిప్ టైటిల్ ఫైట్ లో గుకేశ్ నల్ల పావులతో ఆడగా.. డింగ్ లిరెన్ తెల్ల పావులతో ఆడాడు. ఈ క్రమంలో వీరిద్దరు కూడా నల్ల, తెలుపు రంగు దుస్తులు వేసుకొని నాట్యం చేశారు. ప్రత్యర్థి వేసిన ఎత్తులను తెల్ల వస్త్రాలు ధరించిన ఆమె నాట్యంతో చూపించగా.. నల్ల దుస్తులు ధరించిన మరొకరు గుకేశ్ వేసిన పై ఎత్తులను తన నాట్యంతో చూపించింది. వీరి క్రియేటివిటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అద్భుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి. ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రపంచ కిరీటం కోసం అటు డింగ్ లిరెన్, ఇటు గుకేశ్ నాలుగు గంటలకు పైగా పోరాడారు. మొత్తం 58 ఎత్తుల్లో మ్యాచ్ ముగిసింది. ఒక దశలో ఇద్దరి దగ్గర ఒక్కో ఏనుగు, ఒంటె మాత్రమే మిగిలాయి. అయితే గుకేశ్ దగ్గర అదనపు సిపాయి మిగిలి ఉంది. ఈ దశలో మ్యాచ్ డ్రా అయ్యేలా కనిపించింది. టై బ్రేక్ తప్పదని మ్యాచ్ ను వీక్షించిన అభిమానులకు అనిపించింది. అయితే 55వ ఎత్తులో లిరెన్ చేసిన తప్పిదాన్ని తనకు అనుకూలుంగా మల్చుకున్న గుకేశ్ విజేతగా నిలిచాడు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.