కర్నూలు లేపాక్షి హ్యాండ్లూమ్ ఎంపోరియంలో థీమాటిక్ ఎగ్జిబిషన్..!! చేనేత హస్తకళలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ నిర్వహిస్తున్న లేపాక్షి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో కళాకారులను ప్రోత్సహించే విధంగా వారి తయారీ ఉత్పత్తులను కొనుగోలుదారులకు చేరవేసే విధంగా చేతి వృత్తి కళాకారులు తయారు చేసినటువంటి వస్తువులను అమ్మకాలు చేస్తూ కళాకారులకు అండగా నిలుస్తుంది లేపాక్షి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ సొసైటీ. కనుమరుగువుతున్న కళలను ప్రాణం పోసి వాటికి మరింత పూర్వ వైభవం చర్చే విధంగా కృషి చేస్తూనే అన్ని జిల్లా కేంద్రంలోని ప్రత్యేకంగా లేపాక్షి ఎంపోరియంలను ఏర్పాటు చేసి చేతితో తయారుచేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ పట్టణంలోని కర్నూల్ ఐకానిక్ కొండారెడ్డి బ్రిడ్జి సమీపంలో ఉన్నటువంటి లేపాక్షి ఎంపోరియం లో చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించే దిశగా కర్నూలు లేపాక్షి హ్యాండ్లూమ్ ఎంపోరియంలో థీమాటిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించామని ఆ సంస్థ మేనేజర్ తిమ్మయ్య తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కం సెల్ లో వస్తువులను నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలుదారులకు అమ్మకాలు జరిపిస్తామని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో కొనుగోలు దారులను అబ్బురపరిచే కొండపల్లి, ఎట్టి కొప్పాక బొమ్మలు, వుడ్ క్వారింగ్ బొమ్మలు వస్తువులు, రాయలసీమలో ప్రత్యేకత గాంచిన ఆళ్లగడ్డ రాత్రి శిల్పాలు, మదనపల్లె టెర్రికోట మట్టి పాత్రలను ఉంచామని తెలిపారు. ఐదు రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్లో వస్తువులను తయారుచేసినటువంటి కళాకారులే వాటి అమ్మకాలను సాగిస్తారని తెలిపారు. కావున కొనుగోలుదారుల సైతం కళాకారులను ఆదరించి వారు తయారు చేసినటువంటి వస్తువులు బొమ్మలను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని తెలిపారు. ఇందులో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన వాటిలో కొండపల్లి బొమ్మలు ప్రేత్యేక ఆకర్షణంగా నిలిచాయి. ఇందులో కిందపల్లికి చెందిన చేతి వృత్తి కళాకారుడు నాగబాబు మాట్లాడుతూ తాను గత 35 ఏళ్లుగా ఈ కొండపల్లి బొమ్మలను తయారు చేస్తున్నానని ప్రస్తుతం తాము తమ కుటుంబంచేతులతో తయారు చేసినటువంటి ఈ కొండపల్లి బొమ్మల్ని విక్రయించేందుకు కర్నూలు పట్టణానికి వచ్చానని తెలిపారు. తమకు కర్నూలు పట్టనానికి చెందిన లేపాక్షి ఎంపోరియం వారు తాము తయారు చేసిన బొమ్మలను అమ్ముకోవడానికి తమకి సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికీ కృతఙ్ఞతలని తెలిపారు. None
Popular Tags:
Share This Post:
Drone Summit: డ్రోన్స్ హబ్ గా ఏపీ.. రెండ్రోజుల పాటు డ్రోన్ సమ్మిట్
- by Sarkai Info
- October 22, 2024
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Comet - India: అరుదైన తోకచుక్క.. భారతీయులకు ప్రత్యేకం!
- By Sarkai Info
- October 16, 2024
Latest From This Week
Srisailam Temple: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్ 2 నుంచి..
NEWS
- by Sarkai Info
- October 16, 2024
Rakul Preet: వర్కవుట్స్ చేస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ కు తీవ్ర గాయం.. ఏమయ్యిందంటే..?
NEWS
- by Sarkai Info
- October 16, 2024
Navodaya Admissions: నవోదయ స్కూల్లో చదవాలనుకునే వారికి శుభవార్త.. దరఖాస్తు చేసుకోండిలా!
NEWS
- by Sarkai Info
- October 16, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.