NEWS

AP News: ఇంటికి పార్శిల్.. ఏముందని తెరిచి చూస్తే ఒక్కసారిగా కాళ్ల కింద భూకంపం, ఏపీలో..

AP News: ఇంటికి పార్శిల్.. ఏముందని తెరిచి చూస్తే ఒక్కసారిగా కాళ్ల కింద భూకంపం.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎండగండ గ్రామంలో అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని కుదిపేసింది. ఏకంగా పార్సిల్ వచ్చిన పెట్టెలో మృతదేహం ఉండడంతో ఆ కుటుంబం కంగుతింది. ఇంతకీ అంత పెద్ద బాక్స్ ఆ ఇంటికి ఎందుకు వచ్చింది. మృతదేహం రావడానికి గల కారణాలేంటి. పోలీసులు ఏమంటున్నారు.. ప్రస్తుత పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి ఉండి నియోజకవర్గం ఉండి మండలం ఎండగండ గ్రామంలో క్షత్రియ కులానికి చెందిన తులసి జగనన్న కాలనీలో నివాసం నిర్మాణం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో క్షత్రియ పెద్దల ముందు ఈ విషయాన్ని తులసి ఉంచారు. దీంతో నిర్మించేందుకు క్షత్రియ సేవా సమితి సహకారం అందిస్తానని ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా నివాసానికి సంబంధించిన టైల్స్ సామాగ్రి ఆ నివాసం వద్దకు పార్సిల్ రూపంలో కొరియర్ ద్వారా సంస్థ అందించిందంటూ తెలుస్తుంది. అప్పటివరకు బాగానే ఉన్నా రెండో విడత పార్సిల్ అంటే తెచ్చిన వ్యక్తి కరెంటు సామాగ్రి అమ్మ అంటూ ఆ నివాసానికి ఆ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంటికి కరెంటు సామాగ్రి వచ్చింది కదా అంటూ ఎంతో సంతోషంగా ఆ గృహిణి ఆ బాక్స్ తెరిచి చూడగా మృతదేహం కనిపించింది. వెంటనే భయభ్రాంతులకు గురైన ఆ నివాస గృహిణి స్థానిక పోలీసులకు విషయాన్ని చేరవేసింది. అసలు నివాసానికి వచ్చిన పార్సిల్ లో మృతదేహం ఉండటం ఏంటి? దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా ఆ బాక్స్ పక్కన ఉన్న లెటర్ లో కోటి 30 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్న లెటర్ కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ బాక్స్ నిజానికి ఈ అడ్రస్ కి రావాలా లేక మిస్టేక్ అయి ఎవరో వేసిన స్కెచ్ బాక్స్ ఇక్కడికి వచ్చేసిందా? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఈ విషయంపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రస్తుతానికి మీడియాకి ఎలాంటి సమాచారం అందించలేదు త్వరలోనే చెబుతామంటూ పేర్కొన్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.