NEWS

Bajaj Chetak: బజాజ్‌ చేతక్‌ ఈవీ ఆగయా.. ఫీచర్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి

IMAGE CREDIT GOES TO BAJAJ Bajaj Chetak: వాహన రంగంలో బజాజ్ వెహికల్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక ఆ రంగం నుంచి వచ్చిన చేతక్ ఇవీకి కూడా అంతే ఆదరణ ఉంది. అయితే బజాజ్ చేతక్ ఈవీ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. మీరు ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న చేతక్ ఈవీ రానే వచ్చేసింది. ఇందులో చేతక్‌ 35 సిరీస్‌లో 3501, 3502 పేరిట రెండు వెర్షన్లను మనకి అందిస్తుంది. మరి, ఈ వీటి ధర ఎలా ఉందో తెలుసుకుందాం. ఈవీ చేతక్ ధర ఎంత అంటే? ముందుగా చెప్పినట్లు 35 సిరీస్‌లో 3501, 3502 అంటూ 2 వెర్షన్లను తీసుకువచ్చింది. మొదటగా ఇందులోని ప్రీమియం మోడల్(3501) గురించి మాట్లాడుదాం. ఈ వెహికల్ ధర రూ.1.27 లక్షలు (ఎక్స్‌షోరూమ్). అలాగే 3502 ధర రూ.1.20 లక్షలుగా కంపెనీ తెలిపింది. ఇదే సిరీస్‌లో మరో మోడల్‌ను కూడా త్వరలో మార్కెట్‌లోకి బజాజ్ తీసుకురానుంది. ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఈవీ వెహికిల్స్ అంటే ఎవ్వరైనా ముందు చూసేది బ్యాటరీ పనితీరు. ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్‌ను ఏర్పాటు చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే వేగాన్ని అందుకుని 73 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో దూసుకెళ్తుంది. ఇక దీని బ్యాటరీని 3 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అలా సింగిల్ ఛార్జ్ చేస్తే 153 కిలో మీటర్లు వెళ్లొచ్చు. ఇక అందరు ఎక్కువగా చూసే డిస్‌ప్లేని కూడా పెద్దగానే ఇచ్చారు. 5 అంగుళాల టచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇది. ఇందులో నావికేషన్ చూసుకోవచ్చు. అలాగే కాల్స్, మ్యూజిక్ కంట్రోల్ సదుపాయాలు ఉన్నాయి. అంతే కాదండోయ్ బాబు! యాక్సిడెంట్‌ డిటెక్షన్, ఓవర్‌స్పీడ్ అలర్ట్, జియో ఫెన్స్, థెఫ్ట్ అలర్ట్ వంటి కొత్త ఫీచర్లను ఈ వెహికల్‌లో ఏర్పాటు చేశారు. ఈవీ మార్కెట్‌లో 27 శాతం: ఈ కొత్త చేతక్ ఈవీ మార్కెట్‌లో ఇతర ఈవీలకు పోటీ ఇవ్వగలదు. ఎందుకంటే తక్కువ ధర, మంచి ఫీచర్లు ఉండటం ఈ వెహికల్ ప్రత్యేకత. అయితే గతంలో కూడా బజాజ్ చేతక్ పలు మోడల్స్‌ను లాంచ్ చేసింది. కానీ వాటితో పోల్చితే ఇందులో ఫీచర్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్లు తెలుస్తుంది. ఈవీ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బజాజ్ కొత్త ప్రయోగాలు చేస్తుంది. అందుకే ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా ఈవీలను అమ్మేసింది. ఫలితంగా డిసెంబర్ నాటికి ఈవీ మార్కెట్‌లో 27 శాతానికి పెంచుకుంది. భవిష్యత్తులో మరిన్ని మోడల్స్ తీసుకువచ్చి ఈ శాతాన్ని పెంచుకునే ఆలోచనలో ఉంది బజాజ్. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.