NEWS

రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టాలనుకుంటున్నారా.. ఇవిగో రూల్స్..

If you want a delicious meal, you have to come to the abhiruchi restaurant
రెస్టారెంట్లు, ఫుడ్ సెంటర్లు పెట్టాలనుకున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మొదటగా హోటల్లో పనిచేసే వర్కర్లు ఒక ప్రతి రోజు స్నానం చేసుకొని శుభ్రంగా ఉండి… చేతులకు బ్లౌజు, తలకు టోపీ పెట్టుకుని హోటల్లో కానీ, రెస్టారెంట్లో కానీ పనిచేసే వర్కర్లకు సూచించారు సంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అమృత శ్రీ. రెస్టారెంట్లు, హోటల్స్ లైసెన్స్ తీసుకోవాలన్న ఆన్లైన్లో అప్లై చేసుకుని వారికి ఓటిపి వస్తే ఫుడ్ ఆఫీస్ ని సంప్రదించాలని లోకల్18 తో వివరించారు ఫుడ్ ఇన్స్పెక్టర్. 12 లక్షలు ఉంటే వారికి కేవలం 2000 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుందన్నారు. అంతకంటే పైగా ఉంటే పై అధికారులు చూచి ఎంత ఫీజు చెల్లించాలో రెస్టారెంట్ యజమానులకు చెప్తూ ఉంటారు. నేషనల్ హైవే పక్కన ఉన్న రెస్టారెంట్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. వారి కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో హోటల్ యజమానులతో పాటు వారి సిబ్బందికి ప్రత్యేకంగా రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎలా ఉండాలి, భోజనానికి వచ్చే కస్టమర్లకి ఎంత నీటుగా కనిపిస్తే వారు ఆ హోటల్ కి వచ్చి భోజనం చేసి వెళ్తా ఉంటారన్నారు. హోటల్ యజమానులు సలహా ఇస్తూ ఫుడ్ ఇన్స్పెక్టర్ గా తమ బాధ్యతలను నిర్వహిస్తామని అన్నారు. హోటల్, రెస్టారెంట్ లో కుకింగ్ హాల్లో నీటుగా లేకపోయినా, ఇష్టా రాజ్యంగా హోటల్ యజమానులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు సంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అమృతశ్రీ. ఫాస్ట్ ఫుడ్ లేదా హోటల్, రెస్టారెంట్లు ఫుడ్ నియంత్రణ కాపాడుకోవాలని, కుకింగ్ హాల్ శుభ్రంగా ఉంచి లేని యెడల హోటళ్ళు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకల్ 18తో వివరించారు. హోటల్ భోజనం చేస్తుంటే కస్టమర్లకి అక్కడున్న హోటల్ సిబ్బంది నీటుగా ఉండే విధంగా చూడాలని హోటల్ యజమానులకు సూచించారు. హోటల్, రెస్టారెంట్లు భోజనంలో పురుగులు వస్తే వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ కు లేదా రెవిన్యూ అధికారికి ఫోన్ చేస్తే ఆ హోటల్ యజమానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.