విరాట్ కోహ్లీ (PC : X.com) IND vs AUS 2nd Test : అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా (Team India) తొలి రోజు తేలిపోయింది. మొదట బ్యాటింగ్ లో విఫలమైన భారత్.. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా పస చూపలేకపోయింది. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 33 ఓవర్లలో వికెట్ నష్టపోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం మరో 94 పరుగులు వెనుకబడి ఉంది. మార్నస్ లబుషేన్ (67 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు), నాథన్ మెక్ స్వీని (97 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. వీరిద్దరు అజేయమైన రెండో వికెట్ కు 62 పరుగులు జోడించారు. ఉస్మాన్ ఖవాజ (13) వికెట్ ను భారత బౌలర్లు సాధించారు. అంతకుముందు టీమిండియా కేవలం 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నితీశ్ కుమార్ రెడ్డి (42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (37), శుబ్ మన్ గిల్ (31) రాణించారు. వీరు మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. కోహ్లీ, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి రెండంకెల స్కోరు కూడా దాటలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో మెరిశాడు. కమిన్స్, బొలాండ్ లకు చెరో రెండు వికెట్ల చొప్పున లభించాయి. తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో విఫలం అయినా.. రెండో ఇన్నింగ్స్ లో అదరగొట్టి విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయిన యశస్వి జైస్వాల్ (0) గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. రాహుల్, గిల్ రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు. అయితే రాహుల్ ఈ సమయంలో అవుటయ్యాడు. కాసేపటికే కోహ్లీ (7)ను స్టార్క్ అవుట్ చేశాడు. నిలకడగా ఆడుతున్న గిల్ కూడా అవుటయ్యాడు. రోహిత్ శర్మ (3) విఫలం అయ్యాడు. ఈ దశలో పంత్ (21), నితీశ్ రెడ్డిలు కాసేపు జట్టును ఆదుకున్నారు. అయితే కీలక సమయంలో పంత్ ను కమిన్స్ పెవిలియన్ కు చేర్చాడు. అశ్విన్ (22)తో కలిసి నితీశ్ రెడ్డి భారత్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు క్రీజులో నిలబడటంతో భారత్ 150 మార్కును దాటింది. అయితే అశ్విన్ అవుటైన తర్వాత టీమిండియా కుప్పకూలింది. ఒంటరి పోరాటం చేసిన నితీశ్ రెడ్డి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. None
Popular Tags:
Share This Post:
బిగ్ బ్రేకింగ్.. జనవరి 2న జరగాల్సిన పరీక్ష వాయిదా.. ఎందుకో తెలుసా..?
- by Sarkai Info
- December 20, 2024
What’s New
64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
IIT Madras: ఐఐటీ మద్రాసులో కొత్త కోర్సులు ప్రారంభం.. కొద్ది రోజులే సమయం..
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
AP News: ఇంటికి పార్శిల్.. ఏముందని తెరిచి చూస్తే ఒక్కసారిగా కాళ్ల కింద భూకంపం, ఏపీలో..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Bajaj Chetak: బజాజ్ చేతక్ ఈవీ ఆగయా.. ఫీచర్స్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.