NEWS

IND vs AUS 3rd Test : హెడ్, స్మిత్ సెంచరీల మోత.. భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా.. ప్రస్తుతం ఎంతంటే?

స్మిత్, హెడ్ IND vs AUS 3rd Test : తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగగా.. రెండో రోజు మాత్రం పూర్తి ఆట సాధ్యమైంది. బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా పేసర్లు తేలిపోయారు. బుమ్రా మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. అదే సమయంలో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీల మోత మోగించారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. చేతిలో మరో 3 వికెట్లు ఉండగా.. క్రీజులో అలెక్స్ క్యారీ (45 నాటౌట్) ఉన్నాడు. దాంతో ఆసీస్ మూడో రోజు మరో 50 పరుగులు చేసే అవకాశం ఉంది. ఇక భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో మెరిశాడు. నితీశ్ రెడ్డి, సిరాజ్ లకు చెరో వికెట్ లభించింది. బుమ్రా లేకపోతే టీమిండియా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఓవర్ నైట్ స్కోరు 28/0తో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడింది. మెక్ స్వీని (9), ఉస్మాన్ ఖవాజ (21), మార్నస్ లబుషేన్ (12) వికెట్లను వెంట వెంటనే కూల్చేసింది. ఈ దశలో భారత్ దే పై చేయి. అయితే ఇక్కడి నుంచే కథ మారింది. ఫామ్ లో లేని స్టీవ్ స్మిత్ తో జత కట్టిన ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. మొదట వీరిద్దరు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. లంచ్ అనంతరం వీరిద్దరు రెచ్చిపోయారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ వేగంగా బ్యాటింగ్ చేశాడు. అదే సమయంలో స్మిత్ కూడా బాదడం మొదలు పెట్టారు. బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, నితీశ్ రెడ్డి, జడేజా ఇలా ప్రతి బౌలర్ పై ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా ఆస్ట్రేలియా స్కోరు బోర్డు వేగంగా సాగింది. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ తర్వాత వీరిద్దరు మరింత వేగంగా ఆడారు. ఓవర్ కు 8 చొప్పున పరుగులు చేస్తూ టి20ని తలపించారు. ఈ క్రమంలో స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం కొత్త బంతి తీసుకున్న బుమ్రా స్మిత్ ను అవుట్ చేశాడు. ఆ వెంటనే మార్ష్ ను కూడా పెవిలియన్ కు పంపాడు. 150 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత హెడ్ ను కూడా బుమ్రా పెవిలియన్ కు పంపి 5 వికెట్ల మార్కును అందుకున్నాడు. కమిన్స్ ను సిరాజ్ అవుట్ చేశాడు. అయితే అలెక్స్ క్యారీ మరో ఎండ్ లో నిలబడటంతో ఆసీస్ స్కోరు 400 దాటింది. రెండో రోజు ఆసీస్ ఏకంగా 377 పరుగులు చేసింది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.