NEWS

IND vs AUS 2nd Test : రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం.. చేతులెత్తేసిన భారత బ్యాటింగ్

ప్రతీకాత్మక చిత్రం IND vs AUS 2nd Test : ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన రెండో టెస్డులో టీమిండియా (Team India) ఘోరంగా ఓడింది. తొలి టెస్టులో విజయాన్ని సాధించిన భారత్.. రెండో టెస్టులో మాత్రం అదే ప్రదర్శనను కొనసాగించలేకపోయింది. 19 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా సాధించింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో టీమిండియాపై ఆసీస్ విజయాన్ని అందుకుంది. లక్ష్యం చిన్నిది కావడంతో ఆసీస్ ఓపెనర్లు ఖవాజ, నాథన్ మెక్ స్వీని చెమట పట్టకుండానే ఛేదించేశారు. బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి ఆరంభం కానుంది. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ 36.5 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తద్వారా ఆసీస్ ముందు కేవలం 19 పరుగుల టార్గెట్ ను ఉంచింది. నితీశ్ కుమార్ రెడ్డి (47 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రిషభ్ పంత్ (28), శుబ్ మన్ గిల్ (28) ఫర్వాలేదనిపించారు. వీరిద్దరు మినహా మిగిలిన ప్లేయర్స్ విఫలం అయ్యారు. ఫలితంగా భారత్ కేవలం 18 పరుగుల ఆధిక్యాన్ని ఉంచింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 5 వికెట్లతో మెరిశాడు. స్కాట్ బొలాండ్ కు 3 వికెట్లు.. స్టార్క్ కు 2 వికెట్లు దక్కాయి. ఓవర్ నైట్ స్కోరు 128/5తో బ్యాటింగ్ కు దిగిన భారత్.. వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. రిషభ్ పంత్ ను మిచెల్ స్టార్క్ అవుట్ చేయడంతో భారత్ పతనం మొదలైంది. అశ్విన్ (7) అవుటయ్యాడు. హర్షిత్ రాణా (0)ను కమిన్స్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి హిట్టింగ్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో భారీ షాట్స్ ఆడాడు. మరో భారీ షాట్ ఆడే క్రమంలో అవుటయ్యాడు. ఇక చివరి వికెట్ గా సిరాజ్ (7) అవుటయ్యాడు. దాంతో భారత కథ ముగిసింది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.