NEWS

Cricketer: రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గని సంపాదన.. ఈ మాజీ క్రికెటర్ నెల ఆదాయం రూ.కోటి

Yuvaraj singh Yuvaraj Singh: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఈరోజు తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టీ20, వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన యువరాజ్ సింగ్ తన ఆల్ రౌండ్ గేమ్‌తో తన క్రికెట్ కెరీర్‌లో చాలాసార్లు భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. నెలకు కోటి ఆదాయం.. యువరాజ్ సింగ్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా యువరాజ్ సింగ్ భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ల జాబితాలో కూడా యూవీకి చోటు దక్కింది. తన విరోచితమైన బ్యాటింగ్‌ తో సిక్సర్ల రారాజుగా యువరాజ్ పేరు గడించాడు. జీవనశైలిలో కూడా చాలా మంది భారతీయ ఆటగాళ్ల కంటే ముందున్నాడు. యువరాజ్ సింగ్ ప్రస్తుతం ప్రకటనల ద్వారా ప్రతి నెల దాదాపు కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. 43వ బర్త్ డే.. యువరాజ్ సింగ్ 1981 డిసెంబర్ 12న చండీగఢ్‌లో జన్మించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ 2007 T20 ప్రపంచ కప్‌లో ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాడు. టీ20లో యువరాజ్ 12 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. వన్డేల్లోనూ యూవీదే రికార్డ్.. 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ట్రోఫీ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌కు యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక కావడం క్రికెట్ అభిమానులకు ఇప్పటికి గుర్తు చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత నో రెస్ట్.. 2019లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న యువరాజ్ సింగ్ ప్రస్తుతం పలు స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి భారీగా సంపాదిస్తున్నాడు. ఆయన వ్యక్తిగత ఆస్తులు రూ.50 కోట్లకు పైగా ఉన్నాయి. యువరాజ్ సింగ్ ముంబైలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లను కలిగి ఉన్నాడు. 2013లో ఓంకార్ 1973, వర్లీలోని ఒక విలాసవంతమైన రెసిడెన్షియల్ టవర్ ధర రూ. 64 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశాడు. గ్యారేజ్‌లో లగ్జరీ కార్స్.. యువరాజ్ సింగ్‌కు బెంట్లీ కాంటినెంటల్ GT, లోంబ్రిగిని ముర్సిలాగో, BMW M5 E60, BMW X6M , ఆడి Q5 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అతని ఆస్తి విలువ రూ. 250 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.