NEWS

IND vs AUS 2nd Test : ముగిసిన రెండో రోజు ఆట.. పీకల్లోతు కష్టాల్లో భారత్.. భారమంతా ఆ ఇద్దరి మీదే

రోహిత్ శర్మ (PC : X) IND vs AUS 2nd Test : అడిలైడ్ టెస్టులో టీమిండియా (Team India) పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి రోజు అదరగొట్టిన ఆస్ట్రేలియా.. రెండో రోజూ జోరు ప్రదర్శించింది. దాంతో రోజు ముగిసే సమయానికి భారత్ ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 24 ఓవర్లలో 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్ (28 బ్యాటింగ్), నితీశ్ కుమార్ రెడ్డి (15 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బొలాండ్, ప్యాట్ కమిన్స్ లు చెరో రెండు వికెట్లు సాధించారు. మిచెల్ స్టార్క్ కు ఒక వికెట్ లభించింది. ప్రస్తుతం భారత్ 29 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ పట్టు సాధించాలంటే పంత్, నితీశ్ కుమార్ రెడ్డి మూడో రోజు మొత్తం ఆడాల్సి ఉంటుంది. అప్పుడే భారత్ ఈ మ్యాచ్ లో పట్టు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఆసీస్ చేతిలో మ్యాచ్ ఉంది. 157 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ (7) త్వరగా అవుటయ్యాడు. అయితే జైస్వాల్ (24), గిల్ (28) దూకుడుగా ఆడారు. వీరిద్దరికి మంచి ఆరంభం లభించింది. అయితే జైస్వాల్ ను అద్భుత బంతితో బొలాండ్ అవుట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ (11) కూడా అవుటయ్యాడు. గిల్ ను మిసైల్ లాంటి బంతితో స్టార్క్ అవుట్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (6) మరోసారి విఫలం అయ్యాడు. దాంతో భారత్ వెంట వెంటనే 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో పంత్, నితీశ్ కుమార్ రెడ్డి లు మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ప్రస్తుతం టీమిండియా భారమంతా పంత్, నితీశ్ కుమార్ రెడ్డిలపైనే ఉంది. అంతకుముందు 86/1తో రెండో రోజు ఆటను మొదలు పెట్టిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (140; 17 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. మార్నస్ లబుషేన్ (64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ లు చెరో 4 వికెట్లు సాధించారు. నితీశ్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ లకు చెరో వికెట్ లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆలౌటైంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.