NEWS

Pet Spa: మీ పెంపుడు జంతువులకు స్పా... వీరి సర్వీస్ చూస్తే వావ్ అంటారు

Pet Spa: మీ పెంపుడు జంతువులకు స్పా... వీరి సర్వీస్ చూస్తే వావ్ అంటారు సాధారణంగా మనుష్యుల కోసం స్పా సెంటర్లు బ్యూటీ పార్లర్ ఉంటాయి. ఇది మనకు తెలుసు ఎందుకంటే వెళ్లి కూడా ఉంటాం. అయితే ఇది మాత్రం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన శ్రీకాకుళంలో పెంపుడు జంతువులు కోసం ఒక స్పా సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఏంటి పెంపుడు జంతువులకు పా సెంటర్లో అని ఆశ్చర్యపోవడం మీ వంతు అయిందా? అవును ఇది నిజమే అంటున్నారు స్థానికులు. ఈ స్పా సెంటర్ లో పెంపుడు జంతువుల కోసం ఏ ఏ సదుపాయాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి. శ్రీకాకుళం జీటి రోడ్‌లో ఏర్పాటు చేసిన మార్షల్ పెట్ షాప్ అండ్ స్పా సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో పెంపుడు జంతువుల్లో కుక్కలు, పిల్లులకు ఎక్కువగా ఇక్కడ హెయిర్ కటింగ్, నైల్ కత్తిరింపులు, స్నానం మొదలగు సర్వీసెస్ చేస్తారు. కుక్కలకి స్నానం ప్రొఫెషనల్ గా చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ కుక్కలకి వచ్చే చిన్న చిన్న వ్యాధులకు మందులు కూడా లభిస్తాయి. కుక్కల ఒంటిపై ఉండే కీటకాలు తగ్గేందుకు వీళ్ళు మందులు కూడా సప్లై చేస్తారు. వాటితో వాటికి అవసరమైన ఆహారము, వాటికి బెల్టులు, షాంపూస్, సోప్స్ మొదలగునవి ఈ మార్షల్ పెట్ షాప్ అండ్ స్పా సెంటర్ లో లభిస్తాయి. మార్షల్ పెట్ షాప్ అండ్ స్పా సెంటర్లో చాల రకాల సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. పిల్లి, కుక్కలకు స్నానం చేసి బ్లోయెర్ డ్రైర్ తో అరబెట్టి చెవి శుభ్రపరచడం, గోరు కత్తిరించడం, డాగ్ ఫ్లీ, టిక్ చికిత్సచేయడం. బట్టలు, స్టైలింగ్ చేయడం ఈ షాప్ ప్రత్యేకత. కుక్కలకు ఒకసారి హెయిర్ కట్ కోసం ఏడు వందల రూపాయలు నుండి మూడువేల ఐదు వందల రూపాయలు వరకు ఛార్జ్ చేస్తారు. ఒక్క గోళ్లు కత్తిరింపు కోసం ఒకసారి 150 రూపాయలు చెవులు శుభ్రపరచడానికి 300 రూపాయలు వరకు తీసుకుమాటారు. ఆంటీ ఫంగల్ ట్రీట్ మెంట్ కోసం 950 రూపాయలు నుండి 5,000 రూపాయలు వరకు తీసుకుంటారు. ఇక్కడా నెలవారీ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీరు ఇంటికి కూడా వచ్చి సర్వీస్ అందిస్తారు. మరి ఎందుకు ఆలస్యం మీ కుక్కలను, పిల్లులను కూడా తీసుకెళ్లి హెయిర్ అండ్ నైల్ కటింగ్ చేయించండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.