NEWS

Vivo V60 Pro 5G: కొత్త ఫోన్ కొనే ప్లాన్స్ చేస్తున్నారా? మార్కెట్లోకి రాబోతున్న ‘ది బెస్ట్’ ఫోన్ ఇదే!

Vivo V60 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో, వరుసగా స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ చేస్తూ భారత మార్కెట్‌లో వేగంగా విస్తరిస్తోంది. అందుబాటు ధరలోనే హైఎండ్‌ ఫీచర్లు అందిస్తూ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బెస్ట్‌ బ్రాండ్‌గా నిలిచింది. ఇప్పుడు వివో భారత మార్కెట్‌కు మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. వివో V60 ప్రో 5G పేరుతో వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని రిలీజ్‌ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మిడ్-రేంజ్, ప్రీమియం సెగ్మెంట్‌లో గేమ్ ఛేంజర్గా నిలవనుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. మిడ్‌రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లతో దీన్ని రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిలోని పవర్‌ఫుల్‌ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 4k కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. * వివో V60 ప్రో 5G స్పెసిఫికేషన్లు వివో V60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.82 అంగుళాల పంచ్ హోల్ డిస్‌ప్లేతో రానుంది. ఈ డిస్‌ప్లే 1080 x 2812 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ కలిగి ఉంటుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్పై పనిచేస్తుంది. ఇది గేమర్లకు బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. దీనిలోని ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ మొబైల్‌కు అదనపు భద్రతను చేకూర్చుతుంది. దీనిలో 6500mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. దీన్ని ఒక్కసారి ఫుల్‌ఛార్జ్‌ చేస్తే రోజంతా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని, కేవలం 55 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. * 300 ఎంపీ హైక్వాలిటీ కెమెరా సెటప్‌ V60 ప్రో 5G కెమెరా సెటప్ విషయానికి వస్తే.. దీనిలో 300MP మెయిన్‌ కెమెరాను అందించే అవకాశం ఉంది. ల్యాండ్‌స్కేప్‌, గ్రూప్ షాట్‌ ఫోటోల కోసం 50 MP అల్ట్రా వైడ్ కెమెరా, పోర్ట్రెయిట్ మోడ్ కోసం 16 MP డెప్త్ సెన్సార్‌ కెమెరాలను అందించనుంది. సెల్ఫీ లవర్స్‌ కోసం 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించనుంది. 4K వీడియోను రికార్డ్ చేయగల కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. వివో V60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ మొత్తం 3 స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8GB ర్యామ్‌ + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12GB ర్యామ్‌ + 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 16GB ర్యామ్‌ + 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లలో మార్కెట్‌లోకి రిలీజ్‌ కానుంది. * రూ. 30 వేల ధరలోనే ప్రీమియం ఫీచర్లు వివో V60 ప్రో 5G ధరను అధికారికంగా వెల్లడించనప్పటికీ, కాన్ఫిగరేషన్‌ను బట్టి దీని ధర రూ. 30,999 నుంచి రూ. 34,999 మధ్య ఉండే అవకాశం ఉంది. ఊహాగానాలను బట్టి చూస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌ 2025 ఫిబ్రవరి నుండి మార్చి మధ్యకాలంలో రిలీజ్‌ కానుంది. అందుబాటు ధరలో ప్రీమియం ఫీచర్ల కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ ద్వారా వివో సంస్థ భారత మిడ్‌రేంజ్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.