NEWS

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా డేంజరా..? సైంటిస్టులు ఏమంటున్నారు..?

సాధారణంగా జలాశయాల్లో, సముద్రాల్లో సుడిగుండాలు ఏర్పడుతుంటాయి. ఈ సుడిగుండం పరిధిలోకి ఎంత పెద్ద బోటు వెళ్లినా సరే అందులో మునిగిపోతుంటుంది. కాబట్టి, సుడిగుండాలు ఏర్పడే చోటులో కెప్టెన్లు జాగ్రత్త పడుతూ ప్రమాదం జరగకుండా చూసుకుంటారు. అయితే, ఓ ప్రదేశం మాత్రం ఇందుకు పూర్తి విభిన్నం. భారీ నౌకలే కాదు విమానాలు సైతం ఆ ప్రదేశానికి వెళ్లాలంటే ఓ భయం. ఎందుకంటే, ఇక్కడికి వెళ్లిన ఏ ఒక్క నౌక, పైనుంచి ఎగిరిన విమానం కూడా ఇప్పటికీ తిరిగిరాలేదు. ఆ ప్రదేశమే బెర్ముడా ట్రయాంగిల్. దీన్నే డెవిల్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే విషయంపై ఇంతవరకు ఎవరికీ క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఏంటో చూద్దాం. ఎక్కడ ఉంది? బెర్ముడా ట్రయాంగిల్ అనే ప్రాంతం ఉత్తర అమెరికాలోని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఫ్లోరిడాలోని మియామి అట్లాంటిక్ తీరం, బెర్ముడా, పోర్చుగల్‌కి చెందిన అజోర్స్ ద్వీపాల మధ్య విస్తరించి ఉంది. మూడు ప్రాంతాలను కలుపుతూ ట్రయాంగిల్ షేప్‌లో కనిపిస్తున్నందున దీనికి బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశం గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. శతాబ్దాల నుంచి వీటి మిస్టరీ మిస్టరీగానే మిగిలిపోతోంది. 1918లో 309 మందితో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే నావల్ షిప్ ఈ ఏరియాలో అదృశ్యమైంది. ఈ ఘటన ఆనాడు యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. అప్పటినుంచే దీనిని ప్రమాదకర ప్రదేశంగా భావించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత 1945లో 5 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడిన ఫ్లైట్ 19 అనే ట్రైనింగ్ మిషన్ గ్రూప్ ఆచూకీ కూడా ఇక్కడే మిస్సైంది. వీరిని కనిపెట్టడానికి పంపిన మరో ఫ్లైట్ కూడా తిరిగి రాలేదు. దీంతో పాటు మరో రెండు ఘటనలు కూడా జరిగాయి. 1948లో స్టార్ టైగర్, DC- 3 ఎయిర్‌క్రాఫ్ట్ ఇక్కడ కనిపించకుండా పోయాయి. చాలా డేంజర్ ఈ డెవిల్ ట్రయాంగిల్‌లో ఇప్పటివరకు ఎన్ని నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయనే విషయంపై కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ, కొన్ని కథనాల ప్రకారం దాదాపు 1000కి పైగా షిప్‌లు, విమానాలు ఇక్కడ మిస్సయ్యాయి. కొన్నిసార్లు మాత్రమే ఈ ప్రదేశంలో శకలాలను గుర్తించగలిగారు. అయితే, అవి కూడా ఈ తప్పిపోయిన నౌకలు, విమానాలవనే క్లారిటీ లేదు. దీంతో ఇటు వైపు వెళ్లాలంటే పైలట్లను తెలియని భయం వెంటాడుతుంది. కారణం ఏమై ఉంటుంది? బెర్ముడా ట్రయాంగిల్‌లో నౌకలు, విమానాలు అదృశ్యం కావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక్కడ అకస్మాత్తుగా తుఫానులు రావడం, వాతావరణం భయంకరంగా మారిపోవడం వంటివి ప్రధాన కారణాలు అని చెబుతుంటారు. సముద్రంలో ఏర్పడే సుడిగుండాలు, ఉపరితలంపై ఏర్పడే వాయుగుండాలు సైతం నౌకలను, విమానాలను లోనికి లాగేసుకుంటున్నాయనేది మరో వాదన. అయితే, శాస్త్రీయంగా వీటిని నిరూపించాల్సి ఉంది. అందుకే, చాలా మంది ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రదేశాన్ని మరో ప్రపంచం లేదా ఏలియన్స్‌గా భావిస్తారు. హాలీవుడ్ సినిమాల్లో సైతం ఈ డెవిల్ ట్రయాంగిల్‌ని ఓ మిస్టీరియస్ ప్లేస్‌గా చూపిస్తారు. ఈ ప్రదేశంలోకి ఏదైనా ఎంట్రీ ఇచ్చిందంటే అది పైలోకానికి టికెట్ కొన్నట్లేనని చెబుతుంటారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.