NEWS

Health: కరోనా సోకిన పిల్లలు, యువతకు షుగర్ వ్యాధి వస్తుందా? లేటెస్ట్ స్టడీలో షాకింగ్ నిజాలు..!

ప్రపంచాన్ని దాదాపుగా కోవిడ్‌-19 వీడినా, మహమ్మారి ప్రభావాలు ఇంకా పోలేదు. కరోనా వైరస్‌ బారిన పడిన చాలా మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. శ్వాస సమస్యలు, జాయింట్ పెయిన్స్, నలతగా ఉండటం వంటి లాంగ్ కోవిడ్ ఎఫెక్ట్స్‌ చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో మరో హెల్త్ ప్రాబ్లమ్ చేరింది. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్న వారితో పోలిస్తే కోవిడ్-19 సోకిన పిల్లలు, యుక్తవయస్కులు టైప్ 2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. JAMA నెట్‌వర్క్ ఓపెన్‌ జర్నర్‌లో ఈ స్టడీ పబ్లిష్‌ అయింది. అధ్యయనంలో భాగంగా 2020 జనవరి నుంచి 2022 డిసెంబర్ మధ్య యునైటెడ్‌ స్టేట్స్‌లో 10 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న 6,14,000 మంది పిల్లల మెడికల్‌ రికార్డులను పరిశీలించారు. కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త టైప్ 2 డయాబెటిస్ కేసుల సంఖ్యను పోల్చి చూశారు. రిపోర్ట్స్ పరిశీలిస్తే.. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నవారి కంటే కోవిడ్-19 బారిన పడిన పిల్లలు ఎక్కువగా మధుమేహం బారిన పడ్డారు. టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి? శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించని దీర్ఘకాలిక పరిస్థితిని లేదా శరీరం తగినంత ఇన్సులిన్‌ తయారు చేయలేకపోవడాన్ని టైప్ 2 డయాబెటిస్ అంటారు. దీంతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే అధిక బరువు, చెడు ఆహారపు అలవాట్లు, తగినంత వ్యాయామం చేయకపోవడం వంటి వాటితో కూడా ఈ హెల్త్ రిస్క్ ముడిపడి ఉంటుంది. అధ్యయనం ఫలితాలు కోవిడ్-19 బారిన పడిన పిల్లలకు వైరస్ సోకిన 1, 3 లేదా 6 నెలలలోపు టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది. కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరని పిల్లల్లో కూడా ఈ రిస్కు గుర్తించారు. ఈ అధ్యయనంలో బాలురు, బాలికలు ఇద్దరూ భాగమయ్యారు. వీరి సగటు వయస్సు 14.9 సంవత్సరాలు. అధ్యయనంలో పాల్గొన్న పిల్లల్లో దాదాపు సగం మందికి కోవిడ్-19 సోకింది. అధిక బరువు లేదా ఊకాయంతో బాధపడే వారికంటే వీళ్లకి మధుమేహం సోకే అవకాశాలు రెట్టింపుగా ఉన్నాయి. అదే అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న పిల్లలు, ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్న వారు కోవిడ్-19 బారిన పడుంటే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం రెట్టింపు కంటే ఎక్కువ. రిస్క్ ఎందుకు ఎక్కువ? కోవిడ్ -19 శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది మధుమేహం అభివృద్ధి చెందే అవకాశాలను పెంచుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఆ రిస్కు ఉన్నవారిలో అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కోవిడ్-19 ఇన్సులిన్ ఉత్పత్తికి బాధ్యత వహించే పాంక్రియాస్‌పై ప్రభావం చూపుతుందని, ఇది రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలను కలిగిస్తుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రభావాలు, ఖర్చులు కోవిడ్-19 తర్వాత టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఈ అధ్యయనం పిల్లలకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాల ముప్పును హైలైట్ చేసింది. మధుమేహం చికిత్సకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. 2022లో USలో మధుమేహ సంబంధిత వైద్య ఖర్చుల కోసం దాదాపు $412.9 బిలియన్లు ఖర్చు చేశారు. టైప్ 2 డయాబెటిస్‌కి గురయ్యే పిల్లలు జీవితంలో మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది జీవితకాల వైద్య ఖర్చులకు దారి తీస్తుంది. బరువును నియంత్రించడం వంటి టైప్ 2 డయాబెటిస్‌ను మేనేజ్‌ చేసే కొత్త చికిత్సలు, మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఎక్కువ ప్రమాదం ఉన్న పిల్లల్లో వ్యాధిని నివారించడంపై ప్రధాన దృష్టి పెట్టాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.