NEWS

Liquor Shop Timings: మద్యం షాపుల టైమింగ్స్ ఇవే.. మందుబాబులకు కిక్కే కిక్కు!

Liquor Shop Timings: మద్యం షాపుల టైమింగ్స్ ఇవే.. మందుబాబులకు కిక్కే కిక్కు! శ్రీ సత్యసాయి జిల్లాలో లిక్కర్ షాపుల లైసెన్స్ ఎంపిక విధానం చాలా ప్రశాంతంగా జరిగింది. సాయి ఆరామం కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో జేసీ అభిషేక్ కుమార్, డీఆర్ఓ కొండయ్య సమక్షంలో ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలోని 87 దుకాణాల కేటాయింపును లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జిల్లాలో 87 దుకాణాలకు 518 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ ద్వారా ఎంపిక చేయగా, లాటరీలో ఎంపికైన వారు చాలా ఆనందంగా, ఉత్సాహంగా వెళ్లగా, లాటరీలో షాప్ దక్కని వారు నిరుత్సాహంగా రిక్త హస్తాలతో వెనుతిరిగారు. 82 చోట్ల పురుషులకు, 5 చోట్ల మహిళామణులకు షాపులు దక్కాయి. మహిళలు దక్కించుకున్న నగరాలు ఇలా ఉన్నాయి. పుట్టపర్తి 1, గాండ్లపెంట 1, మడకశిర 1, అమరాపురం 1, హిందూపురం 1 చోట దుకాణాలు దక్కించుకున్నారు. లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వ్యక్తులతో ప్రజా ప్రతినిధులు రాజీ ప్రయత్నాలు చేసి, అందులో పలువురికి అవకాశం కల్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినారు కానీ ఫలితం లేదు. కేంద్రం వద్ద డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సజావుగా లాటరీల ఎంపిక జరిగింది. శ్రీ సత్య సాయి జిల్లాలో 87 మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేసినట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ చెప్పారు. సోమవారం సాయి ఆరామంలో జరిగిన లిక్కర్ టెండర్ల లాటరీ ప్రక్రియను కలెక్టర్, జేసీ అభిషేక్ కుమార్, డీఆర్ఓ కొండయ్య, అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో సువర్ణ, జిల్లా ఎక్సైజ్ అధికారులు గోవింద నాయక్, నరసింహులు పర్యవేక్షించారు. దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ద్వారా ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. లైసెన్స్ ఫీజు సమయంలో కట్టేయాలి. ఇక నుంచి కొత్త లిక్కర్ పాలసీ.. షాపుల సమయాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లాటరీలో 3,396 మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తవడంతో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు జరగనున్నాయి. ఇకపై డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. నిబంధనలను కచ్చితంగా పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని షాపుల యజమానులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.