NEWS

Electric Cycle: ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి వెళ్లొచ్చు.. అదిరే ఎలక్ట్రిక్ సైకిల్, సంవత్సరం ఉచిత సర్వీస్..

Electric Cycle: ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి వెళ్లొచ్చు.. అదిరే ఎలక్ట్రిక్ సైకిల్, సంవత సైకిల్ ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారింది. సైకిల్స్ ఇప్పుడు మినీ బైక్స్ లా మారిపోయాయి. ఫ్యాషన్ కోసం కొందరు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మరికొందరు ఇప్పుడు సైకిల్స్ పై మోజు పడుతున్నారు. సైకిల్స్ కు నగరాల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. దీంతో నయా లుక్ తో సైకిల్స్ మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. పలు కంపెనీలు సైతం అధునాతన ఫీచర్స్ తో సైకిల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఆరోగ్య రక్షణకు వ్యాయామం తప్పనిసరి అని అందరికీ తెలుసు. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా వ్యాయామపరంగా చాలా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక మంది సైక్లింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ సైకిల్స్ అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్నాయి. ట్రెండ్ కు అనుగుణంగా మార్కెట్లోకి రకరకాల సైకిల్ అందుబాటులోకి వస్తున్నాయి. రైడర్లను ఆకట్టుకునేలా కేటీఎం కంపెనీ సైకిల్స్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఏజె పెడల్స్ బైస్కిల్ స్టోర్ లో ఈ సైకిల్ అందుబాటులో ఉంది. మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా తమ స్టోర్ లో కూడా అన్ని రకాల ఖరీదైన సైకిల్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు అఖిల్ వెల్లడించారు. కేటీఎం కంపెనీ వారు విడుదల చేసినటువంటి కేటీఎం సైకిల్ కూడా అందుబాటులో ఉంది. ఈ సైకిల్ అల్యూమినియం ఫ్రేమ్ తో తయారు చేయబడింది. దీనికి సస్పెన్షన్ లాక్ ఇన్, లాక్ అవుట్ ఆప్షన్ ఉంటుంది. గెరింగ్ సిస్టం, దీనికి హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. దీని బరువు 13 కేజీలు వరకు ఉంటుంది. దీని ధర రూ: 65,000 ఉంటుంది. దీనికి అన్ని రకాల స్టాండర్డ్స్ ఉపయోగించి తయారు చేశారు. దాంతోపాటు మా స్టోర్ లో బ్యాటరీ సైకిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. డూడుల్ కంపెనీకి చెందిన బ్యాటరీ సైకిల్ ఒకసారి చార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు వెళుతుంది. ఈ సైకిల్ కు ఫ్రంట్, బ్యాక్ లైట్స్ ఉంటాయి. దాంతోపాటు సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 35 నుండి 40 కేజీల బరువు మోస్తుంది. ఈ సైకిల్ ని మధ్యలోకి ఫోల్డ్ చేయవచ్చు. దీని ధర రూ: 50 వేలు ఉంది. వీటిపై డిస్కౌంట్స్ కూడా అందజేస్తున్నాం. దాంతోపాటు ఈ సైకిల్ కొనుగోలు చేసిన వారికి సంవత్సరం పాటు ఫ్రీ సర్వీస్ కల్పిస్తున్నాం. విదేశాలకు చెందిన అన్ని రకాల సైకిల్స్ మా వద్ద ఉంటాయి. దాంతోపాటు కస్టమర్ కోరిన విధంగా తమకు నచ్చిన సైకిలు కూడా ఆర్డర్ చేస్తే తెప్పిస్తాం అని తెలిపారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.