NEWS

Vaginal Cancer: మహిళల్లో ఈ క్యాన్సర్‌ వస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

ప్రపంచంలో ఎక్కువ శాతం మందిని ప్రభావితం చేస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటి. ఏటా చాలా మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. పురుషులు, మహిళలను చాలా రకాల క్యాన్సర్‌లు ప్రభావితం చేస్తున్నాయి. మహిళలకు వచ్చే అరుదైన, తీవ్రమైన రకం యోని క్యాన్సర్ (Vaginal Cancer). యోనిలో క్యాన్సర్ కణాల అసాధారణ పెరుగుదల వల్ల ఈ వ్యాధి వస్తుంది. యోని క్యాన్సర్‌ని ప్రారంభ దశల్లో గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే లక్షణాలు వెంటనే బయటపడవు. అందుకే ముందుగా గుర్తించడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చాలా ముఖ్యం. లక్షణాలు తెలుసుకోవడం వల్ల మహిళలు వెంటనే చికిత్స తీసుకోవచ్చు. అయితే కొన్ని లక్షణాలు యోని క్యాన్సర్‌ సంకేతాలుగా చెప్పుకోవచ్చు. అవేంటో చూద్దాం. యోనిలో గడ్డ యోనిలో ఒక గడ్డ, కణితి లాంటిది ఏర్పడితే, అది యోని క్యాన్సర్ సంకేతం కావచ్చు. ఈ కణితి నొప్పిలేకుండా లేదా అసౌకర్యంగా ఉండవచ్చు. యోని గోడలపై లేదా ద్వారానికి దగ్గరగా ఉండవచ్చు. ఇలాంటి అన్ని గడ్డలూ క్యాన్సర్ కానప్పటికీ, డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అసాధారణ రక్తస్రావం యోని క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాల్లో ఒకటి అసాధారణమైన రక్తస్రావం. ఇది మెన్‌స్ట్రుయల్ సైకిల్స్‌ మధ్య, రుతువిరతి తర్వాత లేదా లైంగిక సంపర్కం తర్వాత సంభవించవచ్చు. రుతువిరతి తర్వాత ఏదైనా రక్తస్రావం ఉంటే జాగ్రత్త పడాలి. ఇది క్యాన్సర్‌కు ప్రధాన హెచ్చరికగా భావించాలి. తెల్లబట్ట (Vaginal Discharge) క్యాన్సర్‌ కారకాల్లో చూడాల్సిన మరొక సంకేతం తెల్లబట్ట. ఇది తెల్లగా, రక్తంతో కలిసి ఉండవచ్చు లేదా చెడు వాసన కలిగి ఉండవచ్చు. ఇది పీరియడ్స్ టైమ్‌లో వచ్చే తెల్లబట్ట కంటే భిన్నంగా ఉంటుంది. మూత్ర విసర్జన ఇబ్బందులు మూత్రవిసర్జనలో ఇబ్బంది, ఆ సమయంలో నొప్పి అనిపించడం వంటివి యోని క్యాన్సర్‌కు ఇతర సంకేతాలు. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఇబ్బంది, ముఖ్యంగా రక్తస్రావం లేదా నొప్పి కలిగితే నిర్లక్ష్యం చేయకూడదు. పెల్విక్ పెయిన్‌ నిరంతరం పెల్విక్ పెయిన్‌ లేదా అసౌకర్యం కూడా యోని క్యాన్సర్‌ను సూచిస్తాయి. మీరు ఈ ప్రాంతంలో తరచూ నొప్పిని ఎదుర్కొంటే, వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సంభోగం సమయంలో నొప్పి సంభోగం సమయంలో నొప్పిని అనుభవిస్తే, అలానే కాలు నొప్పి లేదా వాపు ఉంటే అప్రమత్తం అవ్వాలి. ఇవి యోని క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. మలబద్ధకం మలబద్ధకం లేదా మలవిసర్జనలో మార్పులు కొన్నిసార్లు యోని క్యాన్సర్‌కు సంబంధించినవి కావచ్చు. క్యాన్సర్ పేగుల పనితీరును ప్రభావితం చేస్తుంది, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ముందస్తుగా గుర్తించడం ముఖ్యం యోని క్యాన్సర్‌ను సమర్థవంతంగా చికిత్స చేయడంలో ముందస్తుగా గుర్తించడం కీలకం. కాబట్టి రెగ్యులర్ చెకప్‌లు , ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, భారతదేశంలోనే 2022లో 14 లక్షల మందికి పైగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 9 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.