NEWS

AP Skill Scam Case: ఏపీ స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకి క్లీన్‌చిట్.. ఈడీ తీరుపై విమర్శలు!

ఏపీ స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకి క్లీన్‌చిట్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఎం చంద్రబాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా టైమ్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు.. మంగళవారం ఈ కేసులో క్లీన్ చిట్ పొందారు. రూ.371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చంద్రబాబు.. 2023లో అరెస్ట్ అయ్యారు. అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలతో ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేసింది. 53 రోజులు జైల్లో గడిపిన చంద్రబాబు.. అక్టోబర్ 31, 2023న జైలు నుంచి బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. చార్జిషీట్‌లో చెప్పిన డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులకు చెందిన రూ. 23.5 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేయడానికి ED హైదరాబాద్ యూనిట్ మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని అమలు చేసింది, అయితే సీమెన్స్ భాగస్వామ్యంతో ఉన్న స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలకూ, చంద్రబాబుకీ సంబంధం లేదని ఈడీ తెలిపింది. ఏప్రిల్ 5న, చంద్రబాబు మళ్లీ సీఎం అవ్వడానికి 2 నెలల ముందు, CID, విజయవాడలోని ప్రత్యేక ACB కోర్టులో ఆయనతో పాటు ఇతరులపై చార్జిషీట్ దాఖలు చేసింది. సీఐడీ నమోదు చేసిన FIR ఆధారంగా.. ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీమెన్స్ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడుల నిధులను మళ్లించడం ద్వారా.. డిజైన్ టెక్ సిస్టమ్స్, ఇతరులు కలిసి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారని FIRలో సీఐడీ రాసింది. సంస్థ ఎండీ వికాస్ వినాయక్ ఖాన్వెల్కర్, సౌమ్యాద్రి శేఖర్ బోస్, అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండీ), వారి సహచరులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్, ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని కేంద్ర దర్యాప్తు సంస్థ (ED) వెల్లడించింది. మెటీరియల్స్/సర్వీస్‌లను సరఫరా చేసే సాకుతో బోగస్ ఇన్‌వాయిస్‌లను సృష్టించి బహుళ-లేయర్డ్ లావాదేవీలను షెల్ కంపెనీల పేరుమీద జరిపారని తెలిపింది. “నిధుల మళ్లింపు కోసం ఎంట్రీ ప్రొవైడర్ల సేవలు నమోదయ్యాయి. ఆ సేవల కోసం వారికి కమీషన్ చెల్లించారు. నిందితులు, ఎంట్రీ ప్రొవైడర్ల చేతుల్లోని నేరాల ద్వారా వచ్చిన ఆదాయాలు గుర్తించడం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్‌లు, షేర్ల రూపంలో వివిధ చరాస్తులు, ఢిల్లీ NCR, ముంబై, పుణేలోని నివాస ఆస్తులు వంటి స్థిర ఆస్తులను గుర్తించి, అటాచ్ అయ్యాయి,” అని ED తెలిపింది. అంతకుముందు, డిజైన్‌టెక్ సిస్టమ్స్‌కు చెందిన రూ.31.2 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇడి అటాచ్ చేసింది. ఈడీ ఇప్పటికే ఖన్వెల్కర్, బోస్, అగర్వాల్, గోయల్‌లను అరెస్టు చేసి విశాఖపట్నం పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ చేసింది. ఇప్పుడీ కథనం పొలిటికల్‌గా హాట్ టాపిక్ అయ్యింది. ఈడీ స్వయంగా ఎలా క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎన్డీయే కూటమిలో భాగం కావడం వల్లే, క్లీన్ చిట్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఎవరు ఏమనుకున్నా.. ఫైనల్‌గా కోర్టు తీర్పే కీలకం. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. దీనిపై అధికారికంగా ఎవరూ తమ అభిప్రాయం చెప్పే పరిస్థితి లేదు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.