NEWS

సముద్రంలో మునిగిపోయిన బోట్లు.. ఎలా బయటికి తీస్తున్నారో చూడండి!

vizag విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్‌లో వివిధ జెట్టీల వద్ద మునిగిపోయిన ఫిషింగ్ ట్రాలర్లు, బోట్ల శిథిలాలను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని పోర్ట్ కార్యదర్శి శ్రీ టి. వేణు గోపాల్ తెలిపారు. ఫిషింగ్ హార్బర్ ఉన్నతీకరణ, ఆధునీకరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పోర్ట్ సెప్టెంబర్ 11న ప్రారంభించారు. ఫిషింగ్ హార్బర్ జెట్టీలలో కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో బోట్లు, ట్రాలర్లు మునిగిపోయి శిథిలవస్థలో ఉన్నాయి. వీటి వలన హార్బర్‌లో బోట్ల కదలికలు, అంతర్గత రక్షణపై ప్రభావం పడుతోంది. దీంతో వీటిని తొలగించాలని నిర్ణయించారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో 6 ఫిషింగ్ ట్రాలర్లు, 11 బోట్లు సముద్రం అడుగున మునిగిపోయినట్లు గుర్తించారు. సముద్రం అడుగున ఏళ్ల తరబడి కూరుకుపోయిన బోట్లను తొలగించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఏళ్ల తరబడి నీటి అడుగున మునిగిపోయి ఉండటంతో అవన్నీ నీటి అడుగున మడ్డిలో కూరుకుపోయి నాచుపట్టి ఉన్నాయి. దీంతో ఈ శిథిలాలను తొలగించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోర్ట్ వినియోగిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా మునిగిపోయిన వాటిని గుర్తించి వాటిని వీడియో చిత్రీకరిస్తున్నారు. శిథిలాలను ముక్కలుగా కత్తిరించేందుకు అండర్ వాటర్ కట్టర్లు వినియోగిస్తున్నారు. శిథిలాలలో పేరుకుపోయిన మడ్డిని తొలగించేందుకు అధిక సామర్థ్యం కలిగిన జనరేటర్, కంప్రెసర్‌లను వినియోగిస్తున్నారు. నీటి అడుగున శిథిలాలను తొలగించడంలో నిపుణులైన వారి సేవలను పోర్ట్ వినియోగించుకుంటోంది. ఈ శిథిలాల తొలగింపునకు సుమారు 1.20 కోట్ల రూపాయలను పోర్ట్ వెచ్చిస్తోంది. 2024 డిసెంబర్ నాటికి ఈ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మత్స్యకారుల సంక్షేమంతోపాటు, ఫిషింగ్ హార్బర్‌లో కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం, సురక్షిత కార్యకలాపాలకు విశాఖపట్నం పోర్ట్ చేస్తుంది. ప్రతి ఏటా విశాఖపట్నం పోర్ట్ వివిధ వ్యర్థాలను తొలగించడం, బీచ్ కోతకు గురికాకుండా బ్రేకింగ్ చేసే బీచ్‌లోను కాపాడటం చేస్తుంది. ఫిషింగ్ హార్బర్ సుందరీకరణలో భాగంగా ఈ శిథిలాలను కూడా తొలగిస్తున్నారు. తెలుగు వార్తలు / వార్తలు / ఆంధ్రప్రదేశ్ / సముద్రంలో మునిగిపోయిన బోట్లు.. ఎలా బయటికి తీస్తున్నారో చూడండి! సముద్రంలో మునిగిపోయిన బోట్లు.. ఎలా బయటికి తీస్తున్నారో చూడండి! vizag ఈ శిథిలాల తొలగింపునకు సుమారు 1.20 కోట్ల రూపాయలను పోర్ట్ వెచ్చిస్తోంది. 2024 డిసెంబర్ నాటికి ఈ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh Last Updated : October 17, 2024, 6:24 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Khalimastanvali Khalimastanvali Reported By : SETTI JAGADESH సంబంధిత వార్తలు విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్‌లో వివిధ జెట్టీల వద్ద మునిగిపోయిన ఫిషింగ్ ట్రాలర్లు, బోట్ల శిథిలాలను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని పోర్ట్ కార్యదర్శి శ్రీ టి. వేణు గోపాల్ తెలిపారు. ఫిషింగ్ హార్బర్ ఉన్నతీకరణ, ఆధునీకరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పోర్ట్ సెప్టెంబర్ 11న ప్రారంభించారు. ఫిషింగ్ హార్బర్ జెట్టీలలో కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో బోట్లు, ట్రాలర్లు మునిగిపోయి శిథిలవస్థలో ఉన్నాయి. వీటి వలన హార్బర్‌లో బోట్ల కదలికలు, అంతర్గత రక్షణపై ప్రభావం పడుతోంది. దీంతో వీటిని తొలగించాలని నిర్ణయించారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో 6 ఫిషింగ్ ట్రాలర్లు, 11 బోట్లు సముద్రం అడుగున మునిగిపోయినట్లు గుర్తించారు. సముద్రం అడుగున ఏళ్ల తరబడి కూరుకుపోయిన బోట్లను తొలగించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఏళ్ల తరబడి నీటి అడుగున మునిగిపోయి ఉండటంతో అవన్నీ నీటి అడుగున మడ్డిలో కూరుకుపోయి నాచుపట్టి ఉన్నాయి. దీంతో ఈ శిథిలాలను తొలగించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోర్ట్ వినియోగిస్తోంది. ప్రకటనలు బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న వారికి భారీ షాక్.. ఈ విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది! ఇందులో భాగంగా ముందుగా మునిగిపోయిన వాటిని గుర్తించి వాటిని వీడియో చిత్రీకరిస్తున్నారు. శిథిలాలను ముక్కలుగా కత్తిరించేందుకు అండర్ వాటర్ కట్టర్లు వినియోగిస్తున్నారు. శిథిలాలలో పేరుకుపోయిన మడ్డిని తొలగించేందుకు అధిక సామర్థ్యం కలిగిన జనరేటర్, కంప్రెసర్‌లను వినియోగిస్తున్నారు. నీటి అడుగున శిథిలాలను తొలగించడంలో నిపుణులైన వారి సేవలను పోర్ట్ వినియోగించుకుంటోంది. మహిళలకు ఊహించని శుభవార్త.. ప్రభుత్వం భారీ ప్రకటన! ప్రకటనలు ఈ శిథిలాల తొలగింపునకు సుమారు 1.20 కోట్ల రూపాయలను పోర్ట్ వెచ్చిస్తోంది. 2024 డిసెంబర్ నాటికి ఈ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మత్స్యకారుల సంక్షేమంతోపాటు, ఫిషింగ్ హార్బర్‌లో కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం, సురక్షిత కార్యకలాపాలకు విశాఖపట్నం పోర్ట్ చేస్తుంది. ప్రతి ఏటా విశాఖపట్నం పోర్ట్ వివిధ వ్యర్థాలను తొలగించడం, బీచ్ కోతకు గురికాకుండా బ్రేకింగ్ చేసే బీచ్‌లోను కాపాడటం చేస్తుంది. ఫిషింగ్ హార్బర్ సుందరీకరణలో భాగంగా ఈ శిథిలాలను కూడా తొలగిస్తున్నారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Local News , Local18 , Visakhapatnam Local News , vizag First Published : October 17, 2024, 6:24 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.