NEWS

Srisailam Temple: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్ 2 నుంచి..

Srisailam Temple: శ్రీశైలం వెళ్లే భక్తులుకు అలర్ట్.. నవంబర్ 2 నుంచి.. శ్రీశైలంలో కార్తీక మహోత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మహోత్సవాలు నిర్వహించనున్నారన్నారు. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్తీక మాసం అంతా గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేయనున్నట్లు చెప్పారు. కార్తీక మాసంలో సోమవారాలలో లక్ష దీపోత్సవం - పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమి రోజున పుణ్యాధి హారతి, జ్వాలాతోరణం, లక్ష దీపోత్సవం - పుష్కరిణి హారతి ఇవ్వనున్నారని తీర్మానించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కార్య నిర్వహణ అధికారి ఆర్. రవణమ్మ, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, అధ్యాపక, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, ఆలయ వేళలు, శ్రీ స్వామి అమ్మవార్ల అర్జిత సేవలు క్యూలైన్లు నిర్వహణ, రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పరిశుద్ధం వాహనాల పార్కింగ్, కార్తీక సోమవారాలు, లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం మరియు పుణ్యనది హారతి ఏర్పాట్లు, కార్తీక మాసంలో ఆకాశదీపం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ మొదలైన అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ముందుగా కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాలను ఆదేశించారు. ఆయా ఏర్పాట్లు అన్నీ కూడా ముందస్తుగా పూర్తి కావాలని అన్నారు, ఈనెల 31వ తేదీ నాటికి అంతా ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేయాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి శుద్ధ బహుళ ఏకాదశులు, ప్రభుత్వ సెలవులు రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని చెబుతూ రద్దీకి అనుగుణంగా ఆయా ఏర్పాట్లు అన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇంకా మాట్లాడుతూ పాతాళ గంగ వద్ద సౌచలయాలకు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు, పాతాళగంగ మెట్ల మార్గాన్ని మొదలైన చోట్ల అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు గాను కార్తీక మాసంలో రద్దీ రోజులందు కార్యాలయాల సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయిస్తారు. వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి పాతకాల పూజలు అనంతరం వేకువ జామున 4 గంటల 30 నిమిషాల నుంచి సాయంకాలం 4 గంటల వరకు దర్శనాలు కల్పిస్తారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. అర్జిత సేవలు: కార్తీక మాసం అంతా కూడా స్వామివారి గర్భాలయం అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేయడం జరుగుతుంది. సర్వదర్శనం క్యూలైన్ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక మాసం శనివారం, ఆదివారం, సోమవారాలు, పౌర్ణమి మొదలైన పర్వదినాలు మినహా ఇతర సాధారణ రోజులలో సామూహిక అభిషేకాలు పరిమితంగా నిర్వహిస్తారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.