NEWS

School Holiday: విద్యార్థులకు అలర్ట్.. 17 గురువారం నాడు 7 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

17 గురువారం నాడు 7 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఆంధ్రప్రదేశ్‌లో 17వ తేదీ గురువారం ఉదయం వేళ వాయుగుండం తీరం దాటబోతోంది. నెల్లూరు, పుదుచ్చేరి మధ్య అది తీరం దాటబోతోంది కాబట్టి.. నెల్లూరు జిల్లాతోపాటూ.. మొత్తం 7 జిల్లాల్లో స్కూళ్లకు గురువారం సెలవు ప్రకటించారు. సెలవు ఇచ్చిన జిల్లాలు ఇవే: నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి, శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో 17న గురువారం అన్ని రకాల స్కూళ్లకూ సెలవు ఉంది. తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురవనుండటంతో.. కలెక్టర్ ఆనంద్ జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అంతేకాదు.. ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అని కోరారు. గురువారం తీరం దాటే వాయుగుండాన్ని తక్కువ అంచనా వెయ్యవద్దు. ఇది రెండు అల్పపీడనాల బలంతో ఏర్పడింది అనే విషయం మనం మర్చిపోకూడదు. అందుకే బుధవారం దీని వల్ల భారీ వర్షాలు కురిశాయి. అలాగే గురువారం కూడా మధ్యాహ్నం వరకూ కురవనున్నాయి. మరో విషయం కూడా ఉంది. తీరం దాటిన తర్వాత ఇది బలహీన పడుతుందనే అంచనా ఉంది. కానీ ఈమధ్య వచ్చిన ఐదారు అల్పపీడనాలు తీరం దాటిన తర్వాత కూడా రెండు మూడు రోజులు బలంగానే ఉన్నాయి. అందువల్ల ఈ వాయుగుండం తీరం దాటిన తర్వాత ఎలా ఉంటుందో మనం గమనిస్తూ, అప్రమత్తంగా ఉందాం. పిల్లలు స్కూళ్లకు వెళ్లకపోతే, చదువు దెబ్బతింటుంది అని అనుకోవద్దు. ఏం కాదు. ఒకట్రెండు రోజులు స్కూల్ మిస్సైతే ఏమవ్వదు. పైగా ఇంట్లో తల్లిదండ్రులతో వారు గడిపే సమయం దక్కుతుంది. మీరు దగ్గరుండి పిల్లలకు చాలా విషయాలు చెప్పొచ్చు. లేదా ఇంట్లోనే వారిని చదువుకోమని కోరవచ్చు. కానీ బయటకు మాత్రం పంపొద్దు. ఈ వర్షంలో కరెంటు తీగలు రాలి నీళ్లలో పడగలవు. చెట్ల కొమ్మలు విరిగిపడగలవు. ఒక్కోసారి రేకుల లాంటివి ఊడి, దూసుకొస్తాయి. ప్రమాదం అన్ని వైపులా ఉంటుంది. గురువారం మధ్యాహ్నం వరకూ మనం జాగ్రత్తగా ఉంటే.. ఆ తర్వాత క్రమంగా పరిస్థితి మెరుగవుతుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.