NEWS

Viral: సినిమా షూటింగ్ కోసం పిలిచి.. స్టార్ హీరోయిన్‌పై గ్యాంగ్‌రేప్.. ఫిల్మ్ మేకర్ షాకింగ్ కామెంట్స్

మూవీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న లైంగిక వేధింపులు, జెండర్ ఈక్వాలిటీపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా తాజాగా మలయాళీ ఫిల్మ్ మేకర్ అలెప్పీ అష్రఫ్ చెప్పిన ఓ విషయం వైరల్ అవుతోంది. మూవీ షూటింగ్ కోసమని అమెరికాకు పిలిపించుకుని ఓ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని తన యూట్యూబ్ ఛానల్‌లో అలెప్పీ వెల్లడించాడు. న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో కొన్ని రోజుల తరబడి ఆ హీరోయిన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ అలెప్పీ అష్రఫ్ తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పిన వివరాల ప్రకారం.. ‘1980 దశాబ్దం తొలినాళ్లలో బేబీ షాలిని, రోహిని, నేను ఓ మిమిక్రీ షో చేయడానికి అమెరికా వెళ్లాం. ప్రతి ఏడాది మాదిరే అప్పుడు కూడా మా మిమిక్రీ షోను తారా ఆర్ట్స్ విజయన్ స్పాన్సర్ చేశారు. నేను కాలేజీలో ఉండగానే ఆ హీరోయిన్ ఎంతో ఫేమస్ అయ్యారు. ఆమె చేసిన సినిమాలు భారీ హిట్ కొట్టాయి. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ లీడ్ ఫీమేల్ యాక్టర్ నటించడంతో పాపులారిటీ సంపాదించారు. ఈ క్రమంలో ఆమెకు అమెరికా నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌ లైన్‌లో అవతలి వ్యక్తి ఈ హీరోయిన్‌కు సినిమా గురించి వివరించాడు. సినిమా షూటింగ్ ఉందని, వెంటనే అమెరికా రావాలని కోరారు. దీంతో అగ్రీమెంట్ ప్రాసెస్ పూర్తి చేసుకుని ఆ హీరోయిన్ యుఎస్‌ బయలు దేరింది.’ ‘అమెరికాలోని న్యూయార్క్‌లో దిగిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. హీరోయిన్‌ను చూడటానికి ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చారు. ఆ తర్వాత ఆమెకు ఓ హోటల్ రూమ్ ఇచ్చి, ఆరోజు అక్కడే ఉండి రెస్ట్ తీసుకోమని సూచించారు. అయితే, ఇక్కడే అసలు విషయం బయటపడింది. సాయంత్రం ఇద్దరు తాగుబోతులు ఆమె గదికి వచ్చారు. వాళ్ల ప్రవర్తన చూసి హీరోయిన్ అయోమయానికి గురైంది. తనను పిలిపించింది సినిమా షూటింగ్ కోసం కాదని, ట్రాప్ చేశారని గుర్తించింది. పైగా, గదిలోకి వచ్చిన ఇద్దరికీ ఈ సినిమాతో ఎలాంటి సంబంధం లేదని, వారు న్యూయార్క్ సిటీలో అండర్‌వరల్డ్ మాఫియా సభ్యులని తెలుసుకుంది. వారిద్దరూ ఆమెను కొన్ని రోజుల తరబడి లైంగికంగా వేధించారు.’ అని అష్రఫ్ వివరించారు ‘నిందితుల నుంచి తప్పించుకోవడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి టెలికాం ఇంజినీర్‌గా పనిచేస్తున్న తారా ఆర్ట్స్ విజయన్ గురించి తెలుసుకుని ఎవరూ లేనప్పుడు ఆయనకు కాల్ చేసింది. విజయన్ వెంటనే స్పందించి ఆమె ఉన్న లొకేషన్‌ని కనిపెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు. న్యూయార్క్ సిటీలోని ఎత్తైన భవనాల్లో ఆమె ఏ రూంలో ఉందో తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి ఆమెకు కిటికీ నుంచి ఏమేమి కనిపిస్తున్నాయో తెలుసుకుని ఆ సైన్ బోర్డుల ద్వారా ఒక అంచనాకు వచ్చి ఆమె ఉన్న అపార్ట్‌మెంట్‌ని కనిపెట్టారు. దీంతో వెంటనే ఆమె హోటల్ కిందికి వచ్చి విజయన్‌ని కలుసుకుంది. ఆయన ఆమెను మరేచోట ఉంచకుండా నేరుగా ఎయిర్‌పోర్టుకి తీసుకొచ్చి టికెట్ కొని ఇండియాకు పంపించారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు భవిష్యత్తులోనైనా జాగ్రత్తగా ఉంటారని. అవకాశాలు వచ్చాయని గుడ్డిగా నమ్మి వెళ్లి మోసపోకూడదని సూచిస్తున్నాను’ అంటూ అలెప్పీ యూట్యూబ్ వీడియోను ముగించాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.