NEWS

House Construction: కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా.. కచ్చితంగా ఈ టెస్ట్ చేయించడం మర్చిపోవద్దు!

కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా.. కచ్చితంగా ఈ టెస్ట్ చేయించడం మర్చిపోవద్దు! కొండ ప్రాంతాల్లో భవనాలు నిర్మించాలన్నా, కొండల్లో కొత్తగా రహదారులు ఏర్పాటు చేయాలన్నా, రాళ్లు ఉండే ప్రదేశంలో భవనాలు నిర్మించాలన్నా కచ్చితంగా రాక్ టెస్ట్ అవసరమని ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ శాంతా రామ్ అంటున్నారు. ఈ రాక్ టెస్ట్ అనేది ఒక్కో ప్రదేశాన్ని బట్టి ఒక్కోరకంగా ఉంటుందని తెలుపుతున్నారు. ముందస్తుగా రాక్ టెస్ట్ చేయకుండా భవనాలు నిర్మించిన, రహదారులు వేసిన భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. రాయి సామర్థ్యాన్ని పరీక్షించి అక్కడ ఎంత వరకు భవనాలను నిర్మించవచ్చని అంచనాలు వేసి రిపోర్టు ఇవ్వడం చేస్తామని అంటున్నారు. రాయి క్వాలిటీ చెక్ చేసేందుకు ఈ రాక్ టెస్ట్ ఉపయోగపడుతుంది. భూమి కింద ఎటువంటి రాయి ఉంది అని, డ్రిల్లింగ్ చేసి ఎంత మందం ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇది ఎంత సామర్థ్యం బరువు మోస్తుంది అనే వివరాలు ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నారు. రాక్ ప్రాపర్టీస్, కంప్రెసర్ సిస్టం ద్వారా అక్కడ ఎంత బరువు వరకు సామర్థ్యం ఉందని చూసి అంచనా వేయవచ్చు అని అంటున్నారు. ఫీల్డ్‌లో శాంపిల్ కట్ చేసి ల్యాబ్‌కి తీసుకొచ్చి అనేక రకాలుగా పరిశీలిస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాలకు డ్రిల్లింగ్ తీసుకువెళ్లి కో డ్రిల్లింగ్ చేయడం ద్వారా భూమి కింద రాయి సాంద్రత, మందం ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇవన్నీ తెలుసుకోవచ్చు అని అంటున్నారు. రాక్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఫీల్డ్‌లోకి వెళ్లి సెలెక్ట్‌గా కొన్ని ప్రాంతాలు మార్కింగ్ చేసి, ఏరియా అంతా చూసి శాంపిల్ తీసుకువచ్చి టెస్ట్ చేస్తామని అంటున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక రకాల రాక్ ప్రాంతాలు ఉన్నాయి అని అంటున్నారు. రాక్ టెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మట్టి కూడా కచ్చితంగా పరిశీలించాలని అంటున్నారు. ఎక్కువగా రాళ్ల మధ్యలో ఎర్రమట్టి ఉంటుందని, వాటిని తీసుకువచ్చి పరిశీలిస్తే అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టవచ్చని అంటున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.