NEWS

ఈ స్వామిని దర్శిస్తే ఎటువంటి దోషాలున్నా 100 శాతం పోవాల్సిందే!

temple ఆ పరమ పావన ప్రాంతంలో బ్రిటిష్ దొరల కాలంనాటి స్వయంభు సుబ్రమణ్య స్వామి వారి శిల అది. బ్రిటీష్ దొరలను గడగడలాడించిన సమయంలో అల్లూరి సీతారామరాజు వంటి వారు సైతం అక్కడ ఆ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించేవారట. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ సుబ్రహ్మణ్యస్వామి ఆకారాన్ని దర్శిస్తే చాలు మనలో ఉన్న చికాకులు పోయి ప్రశాంతతతో జీవిస్తామని ఎంతో విశ్వాసంతో చెబుతున్నారు గిరిజన పుత్రులు. ఇంతకీ ఆ స్వయంభు సుబ్రమణ్య స్వామివారి ఆకారం ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా వెళ్లాలి? ఆ విశేషాలు ఒకసారి చూద్దాం.. తూర్పుగోదావరి జిల్లా శివారు ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అది. రంపచోడవరం నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత మనకి రంప అనే ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ ఈశ్వర ఆలయం పక్కనే మనకి ఈ స్వయంభు సుబ్రమణ్య స్వామివారి ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఒక నిలువుటి రూపంపై సుబ్రహ్మణ్య స్వామి వారి నాగసర్ప ఆకారం మనకు దర్శనమిస్తుంది. నిజానికి చూడగానే మన మనసు జలదరించే విధంగా అక్కడ ఆకారం ప్రతినిత్యం ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగం నడుమ సెలయేర్ల మధ్య మనకి ఈ స్వయంభు ఆలయం దర్శనమిస్తుంది. నాటి కాలం రాతికావడంతో ఇప్పటికీ చెక్కుచెదరకుండా స్వామివారి శిల అదే విధంగా ఆనాడు చెక్కిన శాసనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చి మన శిరస్సును స్వామివారి పాదాలు వద్ద అంటే సర్ప రూపంలో ఉన్న శివారు భాగం వద్ద మన తలను తాకించి మన సమస్యను తెలిపితే కచ్చితంగా తీరుతుంది అంటున్నారు ఈ ప్రాంత గిరి పుత్రులు. ముఖ్యంగా ఇక్కడ వివాహం కాని వారికి ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించి వారి సమస్య చెబితే కచ్చితంగా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి ఇక్కడ స్వామిని దర్శించి వారి సంతానం లేమి సమస్య స్వామికి మనస్పూర్తిగా చెబితే స్వామి సంతానం ఇస్తారని ఎంతో విశ్వాసంతో చెబుతున్నారు. అంతే కాదండి ఈ ప్రాంతానికి వచ్చి వారి సమస్య చెప్పిన తర్వాత మరల తీరిన తర్వాత ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శించాక మా సమస్య తీరింది అని చెప్పే వారి సంఖ్య అధికంగా ఉందంటున్నారు ఈ ప్రాంత వాసులు. తెలుగు రాష్ట్రాలనే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మనకి అనేక సుబ్రహ్మణ్యస్వామి స్వయంభు ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రంప ప్రాంతంలో ఉన్న స్వయంభు సుబ్రమణ్య స్వామి వారి ఆలయ విశిష్టత ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు మహాదేవుడు ఆలయంలో ఈ సుబ్రమణ్య స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు. అల్లూరి సీతారామరాజు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించేవారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే రంపచోడవరం ప్రాంతంలో మనం దిగి అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల రంప ప్రాంతానికి వెళితే ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.