NEWS

Devaragattu: లక్షల్లో జనం.. సంద్రంగా దేవరగట్టు..

devara విభిన్న సాంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన కర్నూలు జిల్లాలో దసరా మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగలు కర్నూలు జిల్లాలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వివిధ సాంప్రదాయ కట్టుబాట్లతో పండుగలను విశేషంగా నిర్వహించడం, ఆనవాయితీగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ వేడుకలు చేసుకోవడం ఈ ప్రాంతం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి దసరా పండుగను కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నవరాత్రి ఉత్సవాల అనంతరం దాదాపు నాలుగు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలనేవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు కొండలపై సుమారు 800 అడుగుల ఎత్తులో స్వామివారు కొలువై ఉంటారు. అయితే దసరా పండుగను పురస్కరించుకొని మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం అర్ధరాత్రి వేళ దివిటీల వెలుగులలో బన్నీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. బన్నీ ఉత్సవం (కర్రల సమరం) ఈ ఉత్సవంలో నేరానిక్కి, నెలనికి తాండ, కొత్తపేట, వంటి మూడు గ్రామాలతో పాటు మిగతా 25 గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకునేందుకు పోటీపడతారు. ఇందులో కర్రలతో చేసే సమరంలో వందల మంది గాయపడినా ఉత్సవం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తైతే దసరా పండుగ పూర్తయిన తర్వాత కూడా దాదాపు నాలుగు రోజులపాటు దేవరగట్టులో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక విధమైన సాంప్రదాయ పద్ధతులలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా బన్నీ ఉత్సవం అనంతరం జరిగే గురవయ్యల గొలుసు తెంపుట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గురవయ్యలు వారి సాంప్రదాయ నృత్యాలతో అందరినీ ఆకట్టుకుంటారు. అనంతరం భారీ పరిమాణంలో ఉండే ఇనుప గొలుసును ఆడుతూ పాడుతూ అవలీలగా తెంపి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ గొలుసు తెంపే విధానాన్ని చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రావడం విశేషం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.