NEWS

దేవుని కడప.. క్షేత్రపాలకుడు హనుమంతుడు...

kadapa మన చుట్టూ మనకి తెలియని విషయాలు విశేషాలు చాలా ఉంటాయి. వాటి గురించి తెలుసుకున్నప్పుడు, విన్నప్పుడు ఆ విశేషాలు అబ్బుర పరుస్తాయి. అలాంటి విశేషం మన కడపలో ఉంది. మన కడప తిరుమల తొలి గడపగా పేరు పొందింది. క్రుపాపురంగా పిలవబడింది. కరిపేగా చెప్పబడింది. వీటి అన్నింటికీ మూల కారణం ఒకటే అదే తిరుమల తొలి గడప. మన కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. మన కడపలో ప్రధానంగా చెప్పుకోబడిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో మొదటగా చెప్పుకోదగిన ఆలయం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చరిత్ర చెప్పుకుంటే జనమేజయుడు తన కలలో కనిపించిన వెంకటేశ్వర స్వామి చెప్పినట్లు చెరువులో ఉన్న విగ్రహాన్ని వెలికి తీయించి తిరుమలకి వాయువ్యంగా పది యోజనాల దూరంలో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించక ముందే ఇక్కడ ఒక ఆలయం కలదు. అదే ఆంజనేయ స్వామి ఆలయం. జనమేజయుడు శ్రీ వారి విగ్రహాన్ని పాత కడప చెరువు నుండి బయటకి తీయించి విగ్రహాన్ని సమీపంలో ఉన్నటువంటి సుమారు పది అడుగుల పొడవు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట ప్రతిష్టించాడు. అందువలనే తిరుమల వరాహ క్షేత్రం అయితే ఆ తిరుమల తొలి గడప దేవుని కడప హనుమత్ క్షేత్రం అయింది. ఈ ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఒక చరిత్ర ఉంది. ఇక్కడుందే ఆంజనేయ స్వామి ఆలయం సాక్షాత్తు శ్రీ రాముడు దుష్ట శిక్షణార్థం రక్షణగా ఏర్పాటు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విధంగా ఏర్పాటు కాబడిన ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం మూలంగానే కడపకి ఆ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పలువురు రాజులు, రాజ వంశాలు పరిపాలనలో ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెంది నేడు మనం చూస్తున్న ఆలయంగా మారింది. ఇప్పటికీ ఇక్కడ మనం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దేవుని కడపలో ప్రతి శుక్రవారం దర్శించుకోవచ్చు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.