NEWS

Laptop Repair: ఎలాంటి కంప్యూటర్, ల్యాప్‌టాప్ అయిన నిమిషాల్లోనే రిపేరీ చేస్తారు.. రూ.500 నుంచి తీసుకుంటారు అంతే..

ఎలాంటి కంప్యూటర్, ల్యాప్‌టాప్ అయిన నిమిషాల్లోనే రిపేరీ చేస్తారు.. రూ.500 తీసుకుంటారు అంతే ల్యాప్‌టాప్ నిత్యావసర వస్తువుగా మారింది. ఈ రోజుల్లో ఏది కొనాలన్నా కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. సాధారణంగా గాడ్జెట్స్, డివైజెస్‌కు వాటి కాన్ఫిగరేషన్, బ్రాండ్ ఆధారంగా బట్టి ధర నిర్ణయిస్తారు. అయితే మన అవసరాలు, లాప్‌టాప్ సామర్థ్యం ఎంత, తదితర అంశాలపై కాస్తంత స్పష్టత వస్తే లాప్‌టాప్ ఎంపిక సులువవుతుంది. ఇప్పుడైతే వేర్వేరు అవసరాల కోసం బ్రాండెడ్ కంపెనీలు నిర్ధిష్టంగా లాప్‌టాప్‌ శ్రేణిని సూచిస్తున్నాయి. అయితే స్వయంగా మనమే వాటి గురించి అవగాహన కలిగి ఉంటే మన బడ్జెట్‌పై భారం పడదు. మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూద్దాం. సగటు మనిషికి జ్వరం, తలనొప్పి వస్తే ఎలాగో టాబ్లెట్లు వేసుకుంటామో, హాస్పిటల్ కి వెళుతూ వస్తూ ఉంటామో, అలాగే లాప్‌టాప్, కంప్యూటర్ కొనడమే కాదు. వాటిని తరచూ రిపేర్, చెక్ చేస్తూ ఉండటం కూడా ముఖ్యమే. ఎక్కడ రిపేరు చేపించాలి? ఎక్స్‌పర్ట్స్ ఎవరు? ఇలాంటి విషయాలపైన మనం ప్రాంతాల్లో చూసుకోవడం, తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం కూడా ఒక అలవాటు చేసుకోవాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్. సత్య సాయి జిల్లా కదిరిలో “చిప్ సొల్యూషన్” అనే ఒక కంప్యూటర్ రిపేరింగ్ సెంటర్ 10 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతున్నాడు ఆసిఫ్ అనే యువకుడు. ఇతని దగ్గర ఎటువంటి లాప్‌టాప్, కంప్యూటర్, మానిటర్ మొదలు పరికరాలు, ఎలాంటి మొండి రిపేరు అయినా కేవలం 30 నిమిషాల్లో రిపేరు చేసి ఇవ్వడం ఇతని ప్రత్యేకత. మదర్ బోర్డ్ రిపేర్, లాప్‌టాప్ స్క్రీన్ రిపేర్, కంప్యూటర్ కాన్ఫిగరేషన్, ట్రెండుకు తగ్గట్టు కంప్యూటర్లో లాప్‌టాప్‌లు, వాటికి సంబంధించిన పరికరాలు, బ్యాటరీలు, చార్జర్లు, కేబుళ్లు ఇలాంటి రిపేరైనా ఇతనికి రిపేర్లు పైన మెకానిక్ విభాగంలో ఇతనికి 20 ఏళ్లు అనుభవం ఉంది. ఢిల్లీకి వెళ్లి కూడా తర్ఫీదు పొంది వచ్చాడు ఆసిఫ్. మదర్ బోర్డు రిపేర్లు అలాంటివి అయితే 500 రూపాయల నుంచి 1200 రూపాయలు వరకు రిపేర్ ఖర్చు చేస్తారంటున్నారు ఆసిఫ్. కొంతకాలం క్రితం అయితే కదిరి నుంచి చాలామంది లాప్‌టాప్‌లు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు తీసుకువెళ్లి రిపేరు చేయించుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అన్ని వీరి దగ్గర రిపేర్ లో అందుబాటులోనే. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో రిపేరు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ జస్ట్ 30 నిమిషాల పాటు ఇక్కడ కూర్చున్న అంతసేపులో అతని ముందర తాము రిపేరు చేసి ఇవ్వగలమన్నారు. ఇదే తమ ప్రత్యేకత అన్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.