NEWS

పితృదేవోభవ.. ఓ తండ్రికి ఎంత కష్టం..

పితృదేవోభవ.. ఓ తండ్రికి ఎంత కష్టం.. కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా.. సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకొని ఆమె వెంట వెళ్లారు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామన్నారు. తెలుగు వార్తలు / వార్తలు / ఆంధ్రప్రదేశ్ / పితృదేవోభవ.. ఓ తండ్రికి ఎంత కష్టం.. పితృదేవోభవ.. ఓ తండ్రికి ఎంత కష్టం.. పితృదేవోభవ.. ఓ తండ్రికి ఎంత కష్టం.. బిడ్డ కోసం నాన్న పడ్డ కష్టం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Hyderabad,Telangana, Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh Last Updated : June 19, 2024, 10:26 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Khalimastanvali Khalimastanvali Reported By : News 18 Telugu సంబంధిత వార్తలు కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా.. సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకొని ప్రకటనలు ఆమె వెంట వెళ్లారు. మహిళలకు భారీ షాక్.. వాళ్లకు మాత్రమే నెల నెలా రూ.2,500, ఎప్పటి నుంచంటే? ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామన్నారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: father , Local News , Local18 First Published : June 19, 2024, 10:26 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.