NEWS

Drone Summit: డ్రోన్స్ హబ్ గా ఏపీ.. రెండ్రోజుల పాటు డ్రోన్ సమ్మిట్

drone summit ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా అమరావతి రాజధానికి ఐకానిక్ ట్రెడ్ మార్క్ తెచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) టెక్నాలజీని మరింత సరళం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడలోఈరోజు, రేపు డ్రోన్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21,22 తేదిల్లో డ్రోన్ సమ్మిట్(Drone Summite) ను విజయవాడలోని పున్నమి ఘాట్ దగ్గరున్న సీకే కన్వెన్షన్ లో నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈకార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. ఏపీని డ్రోన్ హబ్ గా మార్చడమే ఈ సమ్మిట్ లక్ష్యంగా తెలుస్తోంది. వ్యవసాయం, శాంతిభద్రతల అంశాల్లో డ్రోన్లు వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో డ్రోన్ ఎకో సిస్టమ్ తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నాలజీలో పరుగులు.. ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీని అన్నీ రంగాలకు విస్తరింపజేయడానికి ప్రభుత్వం కొత్త ప్రయత్నం చేస్తోంది. ఏపీని డ్రోన్ హబ్ గా మార్చేందుకు ఈనెల 22,23 మంగళవారం, బుధవారాల్లో రెండ్రోజుల పాటు డ్రోన్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ లో 5500 డ్రోన్స్ తో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని సీఎం చంద్రబాబు,కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు.ఈ సమ్మిట్ ను సక్సెస్ చేయడానికి ప్రభుత్వం పది మంది ఐఏఎస్ లకు బాధ్యతలు అప్పగించింది. డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి సురేశ్ కుమార్ పూర్తి ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో సమ్మిట్.. రెండ్రోజుల పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ డ్రోన్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర డ్రోన్ ముసాయిదా విధానం ఆవిష్కరిస్తారని తెలిపారు. ఏపీని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడమే ఈ సమ్మిట్ లక్ష్యమని సురేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 6,929 మంది తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని… డెలిగేట్స్, డ్రోన్ హ్యాకథాన్, ఎగ్జిబిషన్, స్పీకర్స్ విభాగాల్లో తమ పేర్లను నమోదు చేయించుకున్నారని వివరించారు. హ్యాకథాన్ లోని నాలుగు కేటగిరీల విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుంది. రెండు ఎంవోయూలపై ఒప్పందం.. ఈ సమ్మిట్ లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రెండు ఎంవోయూలు కుదుర్చుకుంటుంది. డ్రోన్ పైలెట్ శిక్షణపై క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం ఉంటుందని, తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్టనర్ గా చేర్చుకుంటూ మరో ఒప్పందం ఉంటుంది. నవంబరు చివరి వారం నాటికి డ్రోన్ పాలసీకి తుది రూపునిస్తామని ఏపీ డ్రోన్ కార్పొరేన్ కార్యదర్శి తెలిపారు.ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు విజయవాడ బెరం పార్కులో డ్రోన్ షో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో నిర్వహించబోతున్నారు. డ్రోన్లకు ఏపీ సెంటర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యవసాయం, శాంతిభద్రతల అంశాల్లో డ్రోన్లు వినియోగం పెరిగింది.రాష్ట్రంలో డ్రోన్ ఎకో సిస్టమ్ తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.డ్రోన్ల పరిశోధన, ఉత్పత్తి, టెస్టింగ్, వినియోగంలో ఏపీని అగ్రగామిగా నిలుపుతామని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.