NEWS

Job Alert: నిరుద్యోగులకు జాబ్ అలర్ట్.. భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? రెగ్యులర్‌గా వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ ట్రాక్ చేయడం మర్చిపోయారా? అయితే ఈ విషయం మీకోసమే. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించాయి. వీటిలో ఈ వారం అప్లై చేయాల్సినవి ఏవో చూద్దాం. * ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు 2024 కోసం అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు joinindianarmy.nic.in పోర్టల్‌ ద్వరా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెన్ జులై 16న ప్రారంభం కాగా, ఆగస్టు 14 వరకు అప్లికేషన్‌కు గడువు ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఇండియన్ ఆర్మీ 379 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ కోర్సును ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA) 2025 ఏప్రిల్‌లో కోర్సును ప్రారంభించనుంది. అభ్యర్థుల వయసు 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి. మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. * RRC రైల్వే రిక్రూట్‌మెంట్ సెంట్రల్ రైల్వేస్ డివిజన్ 2,424 అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. పదవ తరగతి లేదా అందుకు సమానమైన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 15 వరకు అధికారిక వెబ్‌సైట్ rrccr.com లో ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ప్రోగ్రామింగ్ & సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, లేబొరేటరీ అసిస్టెంట్, ఇతర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసుకున్న అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ఆధరంగా ఎంపిక చేస్తారు. * SSC-MO రిక్రూట్‌మెంట్ భారత సాయుధ దళాలలో చేరాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) కింద షార్ట్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ (SSC-MO) ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. మొత్తం 450 ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ ఈ పోస్టులకు జులై 16న అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. దరఖాస్తు చేయడానికి ఆగస్టు 4 తుది గడువు. మెడికల్ ఆఫీసర్ (MO) పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి తప్పనిసరిగా MBBS పూర్తి చేసి ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ amcsscentry.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్‌లో ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. * NPCIL రిక్రూట్‌మెంట్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ I/II, నర్స్-A, X-Ray టెక్నీషియన్ ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు NPCIL అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.inలో అప్లై చేసుకోవచ్చు. మొత్తం 74 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెలక్ట్ అయిన వారికి రూ. 44,000 కంటే ఎక్కువ స్టైఫండ్‌ లభిస్తుంది. పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. * DMRC రిక్రూట్‌మెంట్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC), చీఫ్ రెసిడెంట్ ఇంజనీర్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. సివిల్ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు DMRC అధికారిక వెబ్‌సైట్ www.delhimetrorail.com ద్వారా ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ డిప్యూటేషన్ ప్రాతిపదికన జరుగుతుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులకు కనీసం 25 ఏళ్ల అనుభవం ఉండాలి. భువనేశ్వర్‌లో చీఫ్ రెసిడెంట్ ఇంజనీర్ (సివిల్) ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 70,000 నుండి 2,00,000 వరకు జీతం లభిస్తుంది. పాట్నాలోని చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్‌ పోస్టుకు సెలక్ట్ అయిన వారికి నెల జీతం రూ. 1,20,000 నుండి 2,80,000 వరకు ఉంటుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.