NEWS

ITR Deadline: ఆగస్టు 31 వరకు ఐటీఆర్‌ గడువు పెంచే అవకాశం.. ఎందుకంటే..?

ప్రతీకాత్మక చిత్రం మీరు ఇంకా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌(ITR) ఫైల్‌ చేయలేదా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. ఆదాయ పన్ను శాఖ, ప్రస్తుత అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2024-25కి సంబంధించి ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువును జులై 31 నుంచి ఆగస్టు 31 వరకు, ఒక నెల పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 2.2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ ఫైల్‌ చేయాల్సి ఉంది. జులై 31 గడువుకు కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంతేకాకుండా చాలా మంది ఐటీఆర్‌ ఫైలింగ్‌లో టెక్నికల్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే, పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను జులై 31 గడువులోపు దాఖలు చేయాలని ఆదాయ పన్ను శాఖ కోరింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ Xలో చేసిన పోస్ట్‌లో, ‘మీరు ఇంకా ఫైల్ చేయకుంటే, మీ ITR ఫైల్ చేయాలని గుర్తుంచుకోండి. అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2024-25కి సంబంధించి 2024 జులై 31తో గడువు ముగుస్తుంది.’ అని పేర్కొంది. గత సంవత్సరం రికార్డు స్థాయిలో ఐటీఆర్‌ ఫైలింగ్స్‌ గత సంవత్సరం, 2023 జులై 31 నాటికి రికార్డు స్థాయిలో దాదాపు 6.77 కోట్ల రిటర్న్‌లు దాఖలయ్యాయి. ఎక్కువ మంది పన్ను నిబంధనలను పాటిస్తుండటం వల్ల, ఫైలింగ్ ప్రాసెస్‌ని సులభతరం చేయడానికి పన్ను శాఖ చేసిన ప్రయత్నాలతో ఈ స్థాయిలో రిటర్న్స్‌ ఫైల్‌ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? 2024 జులై 26 నాటికి, AY 2024-25కి సంబంధించి దాదాపు 4.6 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్‌ అయ్యాయి. గత ఏడాది జులై 31 నాటికి దాఖలు చేసిన 6.77 కోట్ల ఐటీఆర్‌ల కంటే ఇది చాలా తక్కువ. ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌లోని తాజా డేటా ప్రకారం, ఆదాయ పన్ను పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న 12.4 కోట్ల మంది వ్యక్తులతో పోలిస్తే తక్కువ మందే ఐటీఆర్‌ ఫైల్‌ చేశారు. గడువు పొడిగింపు అవసరం 4.6 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్‌ అయినప్పటికీ, ఇంకా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఫైలింగ్‌ కంప్లీట్‌ చేయాల్సి ఉందని ఓ ట్యాక్స్‌ ఎక్స్‌పర్ట్‌ చెప్పారు. గత సంవత్సరం గమనించిన ట్రెండ్, ప్రస్తుత పరిస్థితిని బట్టి, మిగిలిన పన్ను చెల్లింపుదారులకు అనుగుణంగా గడువును పొడిగించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సాంకేతిక లోపాలపై ఫిర్యాదులు చాలా మంది ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రొఫెషనల్స్‌ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో ఇంప్రూవ్‌మెంట్స్‌ ఉన్నప్పటికీ, పోర్టల్‌లో అడపాదడపా సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో కొంత మంది పన్ను చెల్లింపుదారులు తమ ఫైలింగ్స్‌ని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నట్లు తెలిపారు. గడువు పెంచడం వల్ల ఇలాంటి వారికి ఉపశమనం లభిస్తుందని ట్యాక్స్‌ ఎక్స్‌పర్ట్‌ అభిప్రాయపడ్డారు. పొడిగింపు కోసం అభ్యర్థన భారతదేశంలోని ఓల్డెస్ట్‌ ట్యాక్స్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బార్ అసోసియేషన్ (ITBA).. ఐటీఆర్ ఫైల్ చేసే గడువును పొడిగించాలని ఆర్థిక శాఖను కోరింది. ఒక లేఖలో వెబ్‌సైట్‌లో ఎదురవుతున్న సమస్యలను పేర్కొంది. స్లో స్పీడ్‌, అప్‌లోడ్‌ రిలేటెడ్‌ ప్రాబ్లమ్స్‌, నాన్‌ రెస్పాన్సివ్‌ పేజెస్‌, ఆధార్‌ బేస్డ్‌ ఓటీపీకి వెరిఫికేషన్‌కి UIDAI నుంచి రెస్పాన్స్‌ లేకపోవడం వంటి ఇష్యూలను హైలైట్ చేసింది. పోర్టల్ గత సంవత్సరం మాదిరిగానే సజావుగా పనిచేసేలా చూసుకోవడానికి టెక్నికల్‌ టీమ్‌, వెండార్‌, అఫిషియల్స్‌కి సూచనలు ఇవ్వాలని; అలానే 2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌కి గడువు తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించాలని ITBA కోరింది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.