NEWS

AP Politics: అసెంబ్లీలో అదిరిపోయే సీన్.. మళ్లీ కలుసుకున్న బద్ద శత్రువులు

ys jagan రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా ..పదునైన విమర్శలు చేసుకున్నా.. లెక్కకు మించి ఆరోపణలు గుప్పించినా ఫలితాల తర్వాత అంతా కామన్ అయిపోతుంది. వాళ్లు వీళ్లు ఒకటే అవుతారు. అసలు ఈమాట ఇప్పుడెందుకు అంటున్నామంటే .. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. గతంలో తనకు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించిన జగన్ ను తర్వాత విభేధించి విమర్శలు చేసి టీడీపీలో చేరారు ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామకృష్ణంరాజు(Raghyramakrishnamraju). ఆ తర్వాత జగన్ (YS Jagan)అధికారాన్ని కోల్పోయినప్పటికి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అదే సమయంలో అసెంబ్లీలో కనిపించిన జగన్ ను చూసి రఘురామకృష్ణంరాజు హాయ్ జగన్…అంటూ పలకరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా జగన్ చేతిలో చెయ్యి వేసి మాట్లాడిన ట్రిపులార్ ప్రతీరోజు అసెంబ్లీ రా ప్రతిపక్షం లేకపోతే ఎలా..? అంటూ వైసీపీ (YCP)అధినేత భుజంపై చేయి మాట్లాడటం రాజకీయంగా దుమారం రేపుతోంది. రఘురామకృష్ణంరాజు మాటలకు జగన్ కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. అసెంబ్లీకి రెగ్యులర్ గా వస్తా మీరే చూస్తారుగా అంటూ బదులివ్వడం అసెంబ్లీ సీన్ కి మరింత రక్తి కట్టించినట్లైంది. అసెంబ్లీలో అదిరిపోయే సీన్.. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మధ్య ఎంత పెద్ద వైరం ఉందనే విషయం రాజకీయాలు తెలిసిన వాళ్లకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత ప్రభుత్వంలో అధికార వైసీపీ నుంచి గెలిచి పార్టీలో ఇమడలేక టీడీపీలో చేరిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు..సోమవారం అసెంబ్లీ సమావేశాల వేళ అసెంబ్లీకి వచ్చిన జగన్ తో సరదాగా మాట్లాడారు. హాయ్ జగన్ అంటూ చేతిలో చేయి వేసి విష్ చేయడమే కాకుండా ప్రతీ రోజు అసెంబ్లీ సమావేశాలకు రావాలని..ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ కు ఇన్ డైరెక్టుగా చురకలంటించారు. అయితే రఘురామకృష్ణంరాజు మాటలకు జగన్ కూడా అదే విధంగా స్పందించారు. రెగ్యులర్ గా వస్తాను..మీరే చూస్తారుగా అంటూ కౌంటర్ ఇచ్చారు. జగన్ భుజంపై చేయి వేసి పలకరించిన RRR జగన్ అసెంబ్లీలో కనిపించిన వెంటనే ట్రిపులార్ ఈవిధంగా మాట్లాడటం చూసి వీళ్లిద్దరూ బద్దశత్రువులు కదా ఇంత సరదాగా పలకరించుకుంటున్నారేంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలోనే తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని మంత్రి, అసెంబ్లీ వ్యవహారాల ఇన్చార్జ్ పయ్యావుల కేశవ్‌ను కోరారు రఘురామకృష్ణంరాజు. ట్రిపులార్ మాటలకు సరే అంటూ బదులిచ్చి నవ్వుకుంటూ వెళ్లిపోయారు పయ్యావుల కేశవ్. వైరల్ అవుతున్న వీడియో, ఫోటో.. అయితే అసెంబ్లీ హాల్‌లో జగన్‌ భుజంపై చేయి వేసి రఘురామ కృష్ణం రాజు కొద్దిసేపు ముచ్చటించారు.అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా పలకరించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.