NEWS

Bandla Ganesh: కులం పేరుతో బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్.. టాలీవుడ్ నటుడిపై ట్రోల్స్

bandla ganesh ఆయన ఒకప్పుడు సినిమాల్లో కమెడియన్. ఆ తర్వాత పౌల్ట్రీ రంగంలో అడుగుపెట్టి వ్యాపారవేత్తగా మారాడు. ఆవిధంగా ఏర్పడిన పరిచయాలతో మెల్లగా సినిమా నిర్మాతగా మారాడు. ఇండస్ట్రీతో పాటు సొసైటీలో ఓ సెలబ్రిటీ ఐడెంటి రావడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని.. ఎమ్మెల్యే, మంత్రి కావాలని తెగ ముచ్చటపడ్డాడు. అయితే ఇవేం కార్యరూపం దాల్చలేదు. అందుకే తనకు అవకాశం వచ్చిన ప్రతీ వేదికపై తనకు నచ్చిన వాళ్లను ఆకాశానికి ఎత్తుతూ..గిట్టని వాళ్ల పై విమర్శలు, సెటైర్లు వేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. ఇంత స్పెషల్ క్యారెక్టర్ కలిగిన ఆ నటుడు ఎవరో కాదు బండ్ల గణేష్(Bandla Ganesh). అయితే ఇప్పటి వరకు ఈ కాంట్రవర్సీ లీడర్ చేసిన కామెంట్స్ పక్కన పెడితే తాజాగా ఆదివారం హైదరాబాద్ లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సభలో హాట్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ రాజకీయ నాయకులపై ప్రశంసలు, విమర్శలు చేసే బండ్ల గణేష్ ..ఈసారి ఓ సామాజికవర్గాన్ని కాదు తన సామాజిక వర్గమైన కమ్మ వారిని తెగ పొగుడుతూ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వారి సామాజికవర్గాన్ని గొప్పగా చెప్పుకునే విధంగా ఉన్నప్పటికి బండ్ల గణేష్ ఉదాహరణగా చెప్పిన తీరుపై మాత్రం మిగిలిన సామాజికవర్గాలను తక్కువ చేసి చూపిస్తున్నట్లు ఉన్నాయనే విమర్శలు మొదలయ్యాయి. బోరుబావిలో పడిన లేచివచ్చే కెపాసిటీ కమ్మవాడే అని ..భవిష్యత్తులో అమెరికా(America)కు ప్రెసిడెంట్ అయ్యేది కమ్మ వాడేనని చెప్పాడు. ఇంకా విడ్డూరం ఏమిటంటే సూర్యుడితో గొడవ పడేది కూడా కమ్మవాడే అని బండ్ల గణేష్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతే కాదు కమ్మ వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని ..ఆనందిస్తున్నానని చెప్పడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వెళ్లింది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రోగ్రామ్ అయినప్పటికి ..తన కాస్ట్ గురించి ఇంత గొప్పలు చెప్పుకోవడం.. మిగిలిన కులాలను తక్కువ చేయడం ఏమాత్రం సబబు కాదని చురకలు అంటిస్తున్నారు. బండ్ల గణేష్ బడాయి.. బండ్ల గణేష్ తెలుగువాళ్లకు పరిచయం చేయనక్కర్లేని పేరు. సినీ ఆర్టిస్టుగా జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయనాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో తనకు కులం పిచ్చి లేదని.. కుల, మతాల గురించి పెద్దగా ఆసక్తి చూపనంటూ ట్విట్టర్ ద్వారా పోస్టులు పెట్టిన బండ్ల గణేష్ ఆదివారం తాను కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని.. ఆనందిస్తున్నానంటూ కామెంట్ చేశారు. మాదాపూర్ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్ కి అటెండ్ అయిన బండ్ల గణేష్ కమ్మ సామాజికవర్గానికి సంబంధించి పొగుడుతూ గొప్పగా చెప్పడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ కాదు భజన గణేష్.. రవి అస్తమించని ప్రదేశంలో కూడా కమ్మవాడు జెండా ఎగురవేస్తాడని చెప్పిన బండ్ల గణేష్.. బోరుబావిలో పడ్డ బయటకు రాగల కెపాసిటీ కమ్మవాడికే ఉందని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.భవిష్యత్తులో అమెరికాకి ప్రెసిడెంట్ ఒక కమ్మ వాడు అవుతాడని జోస్యం చెప్పారు బండ్ల గణేష్.కమ్మ వాడికి మోసం, అన్యాయం చేయటం రాదని కమ్మ వాడికి కష్ట పడటం ఒకటే వచ్చని చెప్పారు గణేష్. సినీ నటుడి మాటలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరోరకంగా స్వర్ధంతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. మన కమ్మ కులంలో పేద పిల్లలను ఆదుకొని సాయం చేయండి… అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుందని చెప్పడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. మిగిలిన కులాల సంగతేంటి.. ఎవరి సామాజికవర్గం వారికి గొప్పది. అయితే వారి వారి కులవృత్తులు, జీవనోపాధి, భౌతిక పరిస్థితులను బట్టి వారి ఎదుగుదల వారి సామాజికంగా నిలదొక్కుకునేందు ఉపయోగపడుతుంది. కాని బండ్ల గణేష్ వ్యాఖ్యలు చూస్తుంటే ఇతర సామాజికవర్గాలు అన్నీ తమ సామాజికవర్గం కంటే తక్కువే అన్నట్లుగా చెప్పకనే చెబుతున్నట్లుగా ఉందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో ఏమన్నావు భయ్యా.. ఇదే బండ్ల గణేష్ గత కొద్దిరోజుల క్రితం ఏపీ ఎన్నికలకు ముందు చంద్రబాబును పొగుడుతూ ట్వీట్స్ పెట్టాడు. దీనికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి నీకు అంత కులపిచ్చి ఉండే టీడీపీలో చేరిపోమని కౌంటర్ ఇస్తే తనకు కుల పిచ్చి లేదని ..కేవలం చంద్రబాబు అంటే అభిమానం అంటూ రిప్లై కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. ఇప్పుడు ఈవిధంగా కమ్మ వారిని మోసేయడం చూసి మళ్లీ కామెంట్స్ చేస్తున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.