NEWS

భూమిలో వెలిసిన భద్రకాళి... ఈ అమ్మవారి మహిమలు మహిమాన్వితం

భూమిలో వెలిసిన భద్రకాళి... ఈ అమ్మవారి మహిమలు మహిమాన్వితం అక్కడ భూమిలో వెలిసిన స్వయంభు అమ్మవారిని దర్శిస్తే సకల దోషాలు నివారణ చెందుతాయట. ముఖ్యంగా ఏదో తెలియని అలజడి ఇబ్బందుల్లో ఉన్న మనుషులు ఆ అమ్మవారిని దర్శిస్తే చాలు తప్పక శాంతి చేకూరుతుందని ఎంతో విశ్వాసంతో ఆ జిల్లాలో భక్తులు చెబుతూ ఉంటారంట..కొన్ని వందల సంవత్సరాల కిందట భూమిలో ఉండి ఆపై ఆటలాడుకునే స్థలంలో క్రీడాకారులు అక్కడ అమ్మవారిని గుర్తించడం ఆపై నెమ్మది నెమ్మదిగా ఆలయం నిర్మించడం ఈరోజు ఆ జిల్లాలోనే మహిమాన్విత ఆలయంగా ఎదగడం వంటి చరిత్ర కూడా ఆ ఆలయానికి దక్కిందట ఇంతకీ ఆ ఆలయం ఏంటి ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. కాకినాడ జిల్లా తుని ప్రాంత పట్టణం అది ఆ ప్రాంతంలో గల రాజా మైదానంలో కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభుగా శ్రీ భద్రకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. తొలుత అక్కడ రాజా మైదానంలో ఆటలాడుకునే స్థలంలో ఒక విగ్రహం స్వయంగా బయటికి రావడం ఆ విగ్రహాన్ని అక్కడ క్రీడాకారులు చూడడం అనంతరం అమ్మవారికి నమస్కరించుకుని క్రీడాకారులు క్రికెట్ ఆడుకోవడం వంటి పనులు చేసేవారట. రాను రాను అమ్మవారు మహిమాన్వితం కావడంతో భక్తులు ఆ చెట్టు కింద ఉన్న విగ్రహానికి దర్శించుకోవడం దర్శించుకున్న తర్వాత వారి అనుకున్న పనులు జరగడం ముఖ్యంగా అమ్మవారు ఆరోగ్యం వంటివి ఇవ్వడంతో అక్కడ ఆలయాన్ని సైతం నిర్మించారు. ఇదిలా ఉండగా ఒకసారి అదే ప్రాంతంలో ఒక జంతువుల జూ రావడం ఆ జూ యజమాని అక్కడ ఏర్పాట్లు చేసుకునేందుకు అక్కడ ఆ విగ్రహం అడ్డుగా ఉండడంతో అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి తొలగించడంతో ఆ జూలో ఉన్న జంతువులు అన్నీ అనారోగ్యంతో బ్రతుకుతాయా లేదా అన్న సమస్య వచ్చిందంట. అమ్మవారి విగ్రహం కదపడం కారణంగానే నాకు ఇలా జరిగిందని అమ్మవారి విగ్రహం వద్దకు వచ్చి జంతువులకు ఆరోగ్యం ఇవ్వాలని అలా చేస్తే రక్షణ కూడా కడతానని ఆ జూ యజమాని మొక్కుకోవడంతో రెండు రోజులు వ్యవధిలోనే ఆ జూలో ఉన్న జంతువులన్నీ ఆరోగ్యంగా ఉండడంతో అక్కడ జూ యజమాని రక్షణ కూడా తొలిసారి నిర్మించాడట. అలాంటి మహిమాన్విత చరిత్ర గలిగిన ఈ అమ్మవారు రాను రాను తునిలోనే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని స్వయంభు భద్రకాళి దేవతగా పూజలు అందుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆషాడమాసం కావడంతో విశేష అలంకరణలు ముఖ్యంగా శుక్రవారం కావడంతో అనేక రకాల కూరగాయలు ఆకుకూరలతో భక్తులు అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వారి అనుకున్న పనులు జరగాలంటే కచ్చితంగా ఈ అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. అనేకమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ అమ్మవారిని దర్శించి అనేక ఉన్నత స్థాయిలోకి ఎదిగిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అనేకమంది విశేష అలంకరణలో ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు లోక కళ్యాణార్థం అర్చకులు ప్రసాద్ కుంకుమ పూజా కార్యక్రమాలు సైతం ఈ దివ్య క్షేత్రంలో నిర్వహించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.