NEWS

Viral Video: చాయ్ వాలా కూతురు 10 ఏళ్ల తర్వాత సీఏ పాస్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదవడం అంటే మామూలు విషయం కాదు. అయితే అదే మురికివాడలో ఉన్న పేద కుంటుంబాల్లోని పిల్లలని చదివించడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కరి చదువు కోసం కుటుంబం మొత్తం కష్టపడుతుంది. అయితే ఎన్ని కష్టాలను అయినా పడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే చదివించి తర్వాత.. పిల్లలు ఉన్నత శిఖరాలను చేరుకుంటే వారి ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. తాజాగా అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కుమార్తె విజయం చూసి తండ్రి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. కుటుంబం మొత్తం కలిసి కష్టపడితే కానీ మూడు పూటలా తిండి తినే పరిస్థితి కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. అయితే అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని చదివించడానికి చాలా తక్కువ మంది మాత్రమే ముందుకు వస్తారు. తమకి పనిలో చేదోడువాదోడుగా ఉంటుంది అనుకొని పనిలో ఉంచేస్తుంటారు. కానీ, ఢిల్లీకి చెందిన అమిత ప్రజాపతి అనే అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం అలా ఆలోచించలేదు. సరైన చదువు లేక టీ బండి బండి నడుపుతున్న తమలా తమ కూతురు పరిస్థితి కాకుడదని ఆలోచించి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని పెట్టి అమిత ప్రజాపతిని వారు చదివించారు. అయితే ఆమెను ఉన్నతంగా చూడాలనుకున్న కుటుంబం ఎంతో కష్టమైన సీఏ(CA) చదివించారు. ఆమె సీఏ పూర్తి చేయడానికి ఓ యుద్ధమే చేసిందనే చెప్పుకోవాలి. సాధారణంగా ఎవరైనా సరే సీఏ పరీక్షను నాలుగైదు సార్లు కంటే ఎక్కువసార్లు రాయడానికి ఇష్టపడరు. అప్పటికీ వారు పాస్ కాకపోతే అక్కడితే చదువుకు చెక్ పెట్టేస్తారు. This is Amita Prajapati of Delhi, who said her father(Chai seller) ignored jibes from relatives and faced financial difficulties to ensure she could study. She finally cracked the CA exam after a decade of hard work and realized her dream. pic.twitter.com/iauQpgfyI1 అమిత మాత్రం అలా అనుకోకుండా దాదాపు 10 ఏళ్ల పాటు పట్టువదలకుండా కష్టపడి చదివి చివిరికి సీఏ పూర్తి చేసింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో అమిత సీఏ పూర్తి చేయడంతో ఈ విషయాన్ని తన తండ్రికి ఆప్యాయంగా కౌగిలించుకుని కన్నీళ్లతో సీఏ పూర్తి చేసినట్లు చెప్పింది. దీంతో ఆమె తండ్రి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.