NEWS

Smart Phone: బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఇది అదిరే ఆఫర్ గురూ..!

Nokia Smart phone ఈ పండుగ సీజన్‌లో బడ్జెట్ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. నోకియా G42 ( Nokia G42) 5G స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఎక్ఛేంజ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్‌తో చాలా తక్కువ ధరకే ఈ బడ్జెట్ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చెక్ చేయండి. ఆఫర్ వివరాలు: నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ రూ.16,499తో మార్కెట్‌లో లాంచ్ అయింది. దీనిపై తాజాగా ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ 33 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఫోన్ ధర రూ.10,999కి తగ్గిపోయింది. ఈ మోడల్‌పై రూ.10,200 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. బ్యాంక్ ఆఫర్స్: అమెజాన్‌లో నోకియా G42 5G‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. హెచ్‌డీ‌ఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై నోకియా G42 5G ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ.1099 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డివైజ్‌ను ఈఎంఐ ఆప్షన్‌తో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌పై కొనుగోలు చేస్తే రూ.495 వరకు ఈఎంఐ వడ్డీని సేవ్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్: నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల IPS LCD స్క్రీన్ ఉంటుంది. ఇది 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ సెంటర్‌లో పంచ్-హోల్ కటౌట్ ఉంటుంది. డిస్‌ప్లే డెన్షిటీ 395 PPIతో 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే 560 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఫేస్ అన్‌లాకింగ్, ఫింగర్ ప్రింట్‌సెన్సార్ వంటి ఫీచర్స్‌తో ఈ ఫోన్ మరింత సెక్యూర్డ్‌గా యూజ్ చేయవచ్చు. సో గ్రే, సో పింక్, సో పర్పుల్ వంటి కలర్ ఆప్షన్స్‌లో ఇది లభిస్తోంది. నోకియా G42 హ్యాండ్‌సెట్‌లో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoC చిప్‌సెట్ ఉంటుంది. ఇది ఫోన్ పనితీరును మరింత మెరుగుపర్చుతుంది. ఫలితంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా మల్టీ టాస్కింగ్‌‌ ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో డివైజ్ రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 6GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. బిగ్ ఫైల్స్, వీడియోలు, ఫొటోలు, ఇతర విలువైన డాక్యుమెంట్స్‌ను సులభంగా భద్రపర్చుకోవచ్చు. కెమెరా, ఇతర ఫీచర్స్: నోకియా G42లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MPతో కూడిన మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్స్‌తో ఉంటుంది. ఇతర రెండు కెమెరాలు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌తో ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఉంటుంది. లౌడ్ స్పీకర్, 3.5mm జాకీ, వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్‌ఎం రెడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, యాకిలరో‌మీటర్, ఫ్రాక్సిమిటీ, కాంపస్ వంటి ఇతర ఫీచర్స్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.