స్నేహం కంటే విలువైనది ఈ ప్రపంచంలో లేదు.. అలాంటి స్నేహం, స్నేహితులు మధ్య కులం, మతం అడ్డుగోలుగా నిలిస్తే ఏమవుతుంది.. చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాలకే ఎక్కువ విలువిస్తారా! ఒకవేళ నిజమైన స్నేహం మధ్య కులాలు, మతాలు అడ్డొస్తే పరిస్థితులు ఎలా మారుతాయి.. కులాలతో విడిపోయిన స్నేహితుల మనసుల్లో సంఘర్షణ ఎలా ఉంటుంది.. చివరకు వారు కలిశారా! అనే విషయాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకుడు యదు వంశీ.. నిర్మాతలు పద్మజ కొణిదల, జయలక్ష్మి అడపాక. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్‌లో వచ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సందర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్ట్ 9న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. చిన్నప్పటి నుంచి కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఓ ఊరిలో ఉండే కుర్రాళ్లంతా పెరిగి పెద్దవుతారు. ఊరి జాతరను ఘనంగా జరుపుకునే ఆ ఊర్లో కులాలు, మతాలంటూ గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు ఎంత వరకు వెళతాయంటే స్నేహితులు ఒకరినొకరు తిట్టుకునేంత వరకు, ఒకరినొకరు కొట్టుకునేంత వరకు.. వీరి గొడవలకు భయపడి ఊర్లో జాతర జరుపుకోవాలంటే భయపడుతుంటారు. ఆ సన్నివేశాలను ఈ ట్రైలర్లో చక్కగా ఆవిష్కరించారు. ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా మంచి డైలాగ్స్‌తో సినిమాను ఆవిష్కరించారు. సన్నివేశాలు చూస్తుంటే చాలా సహజ సిద్ధంగా అనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌తో స్నేహం గొప్పదనాన్ని తెలియజెప్పటానికి ఫ్రెండ్స్ ఏం చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. _kb6g నటీనటులు : సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు None
Popular Tags:
Share This Post:
Viral Video: రతన్ టాటాకు వెరైటీ నివాళి.. ఎంత అభిమానం ఉంటే ఇలా చేయాలి
- by Sarkai Info
- October 17, 2024
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Srisailam Temple: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్ 2 నుంచి..
- By Sarkai Info
- October 16, 2024
Latest From This Week
Rakul Preet: వర్కవుట్స్ చేస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ కు తీవ్ర గాయం.. ఏమయ్యిందంటే..?
NEWS
- by Sarkai Info
- October 16, 2024
Navodaya Admissions: నవోదయ స్కూల్లో చదవాలనుకునే వారికి శుభవార్త.. దరఖాస్తు చేసుకోండిలా!
NEWS
- by Sarkai Info
- October 16, 2024
Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా డేంజరా..? సైంటిస్టులు ఏమంటున్నారు..?
NEWS
- by Sarkai Info
- October 16, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.