NEWS

Mobile Hack: మీ ఫోన్‌లో ఈ 7 సంకేతాలు కనిపిస్తే హ్యాక్ అయినట్టే..! వెంటనే ఇలా చేయండి

Mobile Hack ఈ రోజుల్లో టెక్నాలజీ (Technology) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు హ్యాకర్లు సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ స్మార్ట్‌ఫోన్ల (Smartphones)ను సులభంగా హ్యాక్ (Hack) చేస్తున్నారు. తర్వాత మొబైల్‌లో ఉన్న పర్సనల్ డేటాతో పాటు బ్యాంకు వివరాలు కూడా దోచేస్తున్నారు. అయితే మొబైల్ హ్యాక్ అయినట్లు చాలామంది తెలుసుకోలేరు. దీంతో మరింత నష్టం జరుగుతుంది. ఫోన్‌లో 7 సంకేతాలు కనిపిస్తే, అది హ్యాక్ అయినట్టు నిర్ధారణకు రావచ్చు. అవేంటో చూద్దాం. బ్యాటరీ ఖాళీ ఫోన్ హ్యాక్ అయితే, డివైజ్ బ్యాటరీ మునిపటి కంటే చాలా త్వరగా ఖాళీ అవుతుంది. మొబైల్ ఛార్జింగ్ త్వరగా దిగిపోతుంటే ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు లేదా ఏదైనా హానికరమైన అప్లికేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అప్లికేషన్లు సడన్‌గా క్లోజ్ అవ్వడం ఎవరైనా ఫోన్‌ను హ్యాక్ చేసి ఆపరేట్ చేస్తుంటే, ఫోన్‌లోని అప్లికేషన్లు యూజర్ ప్రమేయం లేకుండానే వాటంతటవే క్లోజ్ అవుతాయి. ఇది మొబైల్ హ్యాక్‌ అయిందని తెలియజేస్తుంది. ఫోన్ హీటింగ్ హానికరమైన యాప్స్ ఎప్పుడూ సీక్రెట్‌గా ఫోన్‌లో రన్ అవుతాయి. హ్యాకర్లు వీటిని అలా డిజైన్ చేస్తారు. ఈ అప్లికేషన్లు బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంటాయి. కాబట్టి ఫోన్ వేడెక్కుతుంది. ఇలా జరుగుతుంటే హ్యాకర్ మొబైల్‌ను కంట్రోల్ చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఫోన్ స్లో అవ్వడం ఒకవేళ ఫోన్ హ్యాక్ అయితే, అది చాలా నెమ్మదిగా పని చేస్తుంది. డివైజ్‌లో హ్యాకర్ ఏదో ఒక డేటా స్టీల్ చేయడానికి ఎప్పుడూ దానిని యాక్సెస్ చేస్తూనే ఉంటారు. యూజర్ వినియోగంతో పాటు హ్యాకర్ వినియోగం వల్ల ఫోన్‌పై భారం పడి అది స్లోగా రన్ అవుతుంది. స్క్రీన్ దానంతట అదే వెలగడం మొబైల్ స్క్రీన్ దానంతట అదే వెలిగినా లేదా బ్లింక్ అవుతున్నా దాన్ని హ్యాకర్లు తమ కంట్రోల్లోకి తీసుకొని ఉండవచ్చు. సైబర్ క్రిమినల్స్ ఫోన్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేస్తుండొచ్చు. అంతేకాకుండా యూజర్ ఇంటర్నెట్ వాడకపోయినా, డేటా త్వరగా అయిపోతుందంటే హ్యాకర్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నట్లుగా తెలుసుకోవాలి. అనుమానాస్పద నోటిఫికేషన్లు, పాపప్స్ యూజర్లకు తెలియని, అనుమానాస్పద నోటిఫికేషన్లు వస్తుంటే అనుమానించాలి. ముఖ్యంగా ఏదైనా వైరస్ గురించి అలర్ట్ వస్తుంటే ఫోన్‌లోకి హ్యాకర్ ప్రవేశించినట్లు అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో కొత్త పోస్ట్‌లు బాధిత మొబైల్ యూజర్ ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వారికి తెలియకుండానే హ్యాకర్లు పోస్టులు పెట్టవచ్చు. ఇలా జరిగితే వారి సోషల్ మీడియా అకౌంట్ లేదా ఫోన్ హ్యాక్ అయి ఉండొచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పైన చెప్పిన సంకేతాలు కనిపిస్తే అప్లికేషన్ మేనేజర్‌కి వెళ్లి అనుమానాస్పద యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పటికీ డివైజ్‌లో ఈ సంకేతాలు రిపీట్ అవుతుంటే.. ఫోన్‌ను ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌కు రీసెట్ చేయాలి. ఈ పని చేసే ముందు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకోవాలి. భవిష్యత్తులో మళ్లీ ఫోన్ హ్యాక్ గురి కాకుండా ఉండాలంటే ఒక ట్రస్టెడ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.