NEWS

Sati Poly Plast IPO: ఇన్వెస్టర్లు పండగ చేసుకునే వార్త.. ఈ IPOతో తొలిరోజే కాసుల వర్షం

Sati Poly Plast IPO స్టాక్ మార్కెట్‌లో ఈ మధ్యకాలంలో ఐపీఓల హంగామా మరీ ఎక్కువైంది. మార్కెట్ లోకి క్యూ కట్టిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌ (IPO) లు ఇన్వెస్టర్ల నుంచి భారీ రెస్పాన్స్ అందుకోవడమే గాక.. షార్ట్ పీరియడ్ లోనే వారికి కాసుల పంట పండిస్తున్నాయి. దీంతో ఐపీఓలలో పోటీపడి అప్లై చేస్తున్నారు ఇన్వెస్టర్లు. ఈ క్రమంలోనే తాజాగా నేడు (జూలై 22) BSE, NSE లలో లిస్ట్ అయిన సాటీ పాలీ ప్లాస్ట్ ఐపీఓ తన ఇన్వెస్టర్లకు తొలి రోజే లాభాల పంట పండించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.. మార్కెట్ లోకి ఎంట్రీట్ ఇచ్చిన సాటీ పాలీ ప్లాస్ట్ ఐపీఓ మంచి రిటర్న్స్ అందిస్తోంది. వీక్ మార్కెట్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. తొలిరోజే తన పెట్టుబడి దారులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. సాటీ పాలీ ప్లాస్ట్ ఐపీఓ ఇష్యూ ధర రూ. 130 తో పోలిస్తే ఏకంగా 90 శాతం ప్రీమియంతో రూ. 247 వద్ద ఈ షేర్లు లిస్ట్ అయ్యాయి. అంతటితో ఆగక ఆ తర్వాత షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకడం విశేషం. దీంతో తొలి రోజే ఈ స్టాక్ 100 శాతం పెరిగింది. అప్పర్ సర్క్యూట్ తర్వాత ఈ షేర్ ధర రూ. 259.35 వద్ద ఉంది. గ్రే మార్కెట్ ప్రీమియం అంచనాలకు తగ్గట్లుగా ఈ షేర్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు ఖుషీ అవుతున్నారు. జూలై 12న సబ్‌స్క్రిప్షన్ కోసం ఈ Sati Poly Plast IPO ఓపెన్ కాగా.. జూలై 16తో గడువు ముగిసింది. లాట్ సైజు 1000గా, ఇష్యూ ధర 130గా నిర్ణయించి షేర్ల కేటాయింపు చేశారు. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. జూలై 18న షేర్ల అలాట్‌మెంట్ పూర్తి కాగా.. నేడు జూలై 22న స్టాక్ మార్కెట్ లో ఈ షేర్లు లిస్ట్ అయ్యాయి. ఒక్కో లాట్ కోసం ఇన్వెస్టర్లు 1.30 లక్షల పెట్టుబడి పెట్టగా.. ఆ పెట్టుబడి తొలి రోజే రెట్టింపు కావడం విశేషం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.