NEWS

Vivo X200 Series: వివో X200 సిరీస్ ధరలు లీక్.. అదిరిపోయే ఫీచర్లు బాసూ.. అస్సలు మిస్వకండి..!

చైనీస్ మొబైల్ బ్రాండ్ వివో.. బడ్జెట్ రేంజ్ నుంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్ల వరకు అనేక మోడల్స్ తయారు చేస్తుంది. తాజాగా ఈ కంపెనీ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. వివో X200 సిరీస్‌ను (Vivo X200 Series) త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయనుంది. ముందు అక్టోబర్ 14న చైనాలో ఈ సిరీస్ లాంచ్ కానున్నట్లు సమాచారం. అయితే రిలీజ్‌కు ముందే ఈ సిరీస్‌‌లోని మూడు వేరియంట్లు X200, X200 ప్రో, X200 ప్రో మినీ ఎడిషన్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ లేటెస్ట్ సిరీస్‌లో X200 మొబైల్ స్టాండర్డ్ వేరియంట్‌గా రానుంది. 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర 3,999 యువాన్లు అంటే మన కరెన్సీలో రూ.48వేల వరకు ఉండవచ్చు. ఇందులోనే 16GB/256GB వేరియంట్ 4,299 యువాన్లు(రూ.51,437), 16GB/512GB ఎడిషన్ 4,599 యువాన్లు(రూ.55,026) ఉండగా, 16GB RAM, 1TB స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర 5,099 యువాన్లు(రూ.61,000)గా ఉండనుందని ‘వీబో’(Weibo)లో లీక్ అయ్యింది. వివో X200 ప్రో మోడల్ 16GB RAM, 256GB స్టోరేజ్ ఎడిషన్ ధర 5,199 యువాన్లు(రూ.62,197). దీంట్లోనే 16GB/512GB వేరియంట్ 5,499 యువాన్లు(రూ.65,786)గా ఉండనుంది. దీంతోపాటు ఈ మోడల్‌లో రెండు శాటిలైట్ వర్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 16GB/512GB స్టోరేజ్ ఎడిషన్ ధర 5,699 యువాన్లు(రూ.65,786) కాగా, 16GB RAM, 1TB స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర 6,199 యువాన్లు(రూ.74,160)గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, వివో X200 ప్రో మినీ మోడల్ 12GB RAM, 256GB స్టోరేజ్ ఎడిషన్ ధర 4,599 యువాన్లు(రూ.55,026)గా ఉంటుందట. 16GB/256GB వేరియంట్ 4,899 యువాన్లు(రూ.58,607) కాగా, 16GB/512GB టాప్ వేరియంట్ ధర 5,199 యువాన్లు(రూ.62,196)గా ఉండనుంది. ఈ మోడల్‌లోని మూడు వేరియంట్లు బ్లాక్, వైట్, గ్రీన్, టైటానియం, పింక్ కలర్లలో అందుబాటులోకి రానుంది. వివో ఎక్స్200 మోడళ్ల ధరలు లీకైనప్పటికీ కచ్చితంగా ఇవే ధరలు ఉంటాయన్న నమ్మకం లేదు. మరోవైపు, వివో ఎక్స్100 లాంచ్ అయిన 3,999 యువాన్ల ధరకే వివో ఎక్స్200 ఫోన్లు విడుదల అవుతాయని తెలుస్తోంది. * డిజైన్, ఫీచర్లు వివో X200 సిరీస్ ఫోన్ల డిజైన్, కొన్ని ఫీచర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ డివైజ్‌లు స్పోర్ట్స్ ఫ్లాట్ ఎడ్జెస్‌తో వస్తాయి. చూడటానికి ఈ డిజైన్ శామ్‌సంగ్ గెలాక్సీ S24 సిరీస్ మాదిరిగా ఉంటుంది. అల్ట్రా-స్లిమ్ బెజెల్స్‌తో వచ్చే ఫ్లాట్ డిస్‌ప్లే చాలా క్లాసీ లుక్‌లో కనిపిస్తోంది. లేటెస్ట్ ఫోన్లలో ప్రాసెసర్, భారీ బ్యాటరీలు ఉంటాయని టాక్. వివో ఎక్స్200 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్, పెరిస్కోప్ లెన్స్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. స్టాండర్డ్ వివో X200 ఎడిషన్ 90W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,600mAh బ్యాటరీతో వస్తుంది. బేస్ మోడల్‌లో 50MP OIS ప్రైమరీ కెమెరా ఉండొచ్చని, ప్రో మోడల్‌లో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు పవర్‌ఫుల్ 200MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.