NEWS

Best electric bikes: ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్‌ బైక్స్.. 2024లో టాప్ మోడల్స్ ఇవే..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లపైనే ఆటోమోటివ్ కంపెనీలు ఫోకస్ పెట్టేవి. కానీ ఇప్పుడు కస్టమర్ల ఆసక్తికి తగ్గట్లు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కూడా తయారు చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త ఇ-బైక్ కొనాలని చూస్తుంటే.. 2024లో మార్కెట్లో ఉన్న టాప్-5 మోడల్స్, వాటి ధరలు, ఫీచర్లు చెక్ చేయండి. ఓలా రోడ్‌స్టర్ ప్రో (Ola Roadster Pro) ఓలా ఎలక్ట్రిక్, ఓలా రోడ్‌స్టర్ ప్రో సిరీస్‌తో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. రోడ్‌స్టర్ ప్రో 8 kWh, 16 kWh అనే రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 16 kWh వేరియంట్ టాప్ స్పీడ్ 194 km/h, 579 km రేంజ్‌ అందిస్తుంది. అయితే 8 kWh వేరియంట్ గరిష్ట వేగం 154 km/h, 316 km రేంజ్‌ ఇస్తుంది. 16 kWh వెర్షన్ ఛార్జింగ్ సమయం 7.5 గంటలు, 8 kWh వెర్షన్‌లో అయితే కేవలం 3.7 గంటలల్లో ఛార్జింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. 8 kWh మోడల్‌ ధర రూ.1.99 లక్షలు, 16 kWh మోడల్‌ ధర రూ.2.49 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ABS, ట్రాక్షన్ కంట్రోల్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. రివోల్ట్‌ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్‌ (Revolt RV400 BRZ) అత్యంత పాపులర్‌ అయిన ఎలక్ట్రిక్ బైక్‌లలో రివోల్ట్‌ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్‌ ఒకటి. రివోల్ట్ మోటార్స్ తయారు చేసిన ఈ బైక్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ- ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ బైక్. స్లీక్‌ డిజైన్, పవర్‌ఫుల్ ఫర్ఫార్మెన్స్‌ అందిస్తుంది. RV400 BRZ 72V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఎకో మోడ్‌లో 150 కిమీ, నార్మల్‌ మోడ్‌లో 100 కిమీ, స్పోర్ట్ మోడ్‌లో 80 కిమీ రేంజ్‌ అందిస్తుంది. అన్ని మోడ్స్‌లో గరిష్టంగా 45 km/h వేగాన్ని అందుకుంటుంది. దీని బ్యాటరీ 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. రూ.1.09 లక్షలతో ప్రారంభమయ్యే ఈ బైక్ రీజెనరేటివ్ బ్రేకింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లతో ఆకర్షిస్తుంది. ఓబెన్ రోర్ (Oben Rorr) బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తీసుకొచ్చిన ఓబెన్ రోర్ అనే స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ మరో బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది. ఒబెన్ రోర్ గరిష్టంగా 100 కిమీ/గం వేగాన్ని అందిస్తుంది, 187 కిమీ రేంజ్‌ ఇస్తుంది. ఇది కేవలం 2 గంటల్లో 80% వరకు ఛార్జ్ అవుతుంది. రూ.1.49 లక్షల ధరతో వస్తున్న ఈ బైక్ నియో-క్లాస్ లుక్‌తో ఆకర్షిస్తుంది. డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, థెఫ్ట్ ప్రొటెక్షన్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అర్బన్‌ రైడర్స్‌కి బెస్ట్‌ ఆప్షన్‌. అల్ట్రావయోలెట్‌ ఎఫ్‌77 మాక్ 2 (Ultraviolette F77 Mach 2) అల్ట్రావయోలెట్‌ F77 మాక్ 2 అనేది హై పర్ఫార్మెన్స్‌ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్, ఇది F77 అప్‌గ్రేడ్ వెర్షన్‌. ఈ బైక్ గరిష్టంగా 155 కి.మీ స్పీడ్‌ అందిస్తుంఇ. 323 కి.మీ రేంజ్‌, 10.3 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది స్టాండర్డ్‌ ఛార్జర్‌తో 5 గంటల్లో లేదా బూస్ట్ ఛార్జర్‌తో 2.5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. F77 Mach 2 హిల్ హోల్డ్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌లతో వస్తుంది. ఈ మోడల్ ధర రూ. 2.99 లక్షలు కాగా, మరింత అడ్వాన్స్‌డ్‌ ఎఫ్77 రీకాన్ రూ.3.99 లక్షలకు అందుబాటులో ఉంది. రివోల్ట్‌ ఆర్వీ1, ఆర్వీ1+ (Revolt RV1 and RV1+) తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ బైక్‌ కొనాలనుకునే వారికి రివోల్ట్ మోటార్స్ రివోల్ట్ RV1, RV1+ పేరిట రెండు వెర్షన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. బేసిక్‌ మోడల్‌ ధర రూ.84,990గా ఉండగా, ప్లస్‌ వెర్షన్‌ ధర రూ.99,990(ఎక్స్‌ షోరూమ్‌)గా ఉంది. RV1 100 కి.మీ రేంజ్‌, 2.2 kWh బ్యాటరీతో వస్తుంది. RV1+లో 3.24 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 160 కి.మీ వరకు రేంజ్‌ అందిస్తుంది. రెండు మోడల్‌లు 2 నుంచి 3.5 గంటల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ కంప్లీట్‌ చేస్తాయి. 5 సంవత్సరాల లేదా 75,000 కిమీ వారంటీతో వస్తాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.