NEWS

OnePlus 13: మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు మాత్రం కేక..!

ప్రముఖ చైనా బేస్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ వన్‌ప్లస్‌.. మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తుంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చే ప్రీమియం మోడల్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే వన్‌ప్లస్ ఈ సెగ్మెంట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి రెడీ అవుతోంది. అదే నెక్స్ట్ జనరేషన్‌ వన్‌ప్లస్ 13 (OnePlus 13). ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ నెలాఖరులో లేదా నవంబర్ ప్రారంభంలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అఫీషియల్ లాంచింగ్‌కు ముందే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ 13 ఫీచర్లను కంపెనీ టీజ్ చేసింది. ఇటీవల రిలీజ్‌ చేసిన ఓ అధికారిక పోస్టర్‌ వన్‌ప్లస్‌ 13లో BOE సెకండ్‌ జనరేషన్‌ ఓరియంటల్ స్క్రీన్ ఉంటుందని పేర్కొంది. దీంట్లో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఫీచర్‌ ఉంటుందని బ్రాండ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా హింట్‌ ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు లీక్ అయిన వన్‌ప్లస్‌ 13 ఫీచర్లపై ఓ లుక్కేయండి. * డిజైన్, డిస్‌ప్లే ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 మోడల్, BOE సెకండ్‌ జనరేషన్‌ ఓరియంటల్ స్క్రీన్‌తో రానుంది. ఇది వన‌ప్లస్‌ 12లో అందించిన మొదటి జనరేషన్‌ ఓరియంటల్ స్క్రీన్‌తో పోలిస్తే మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1440x3168 రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ క్వాడ్-మైక్రో-కర్వ్డ్ డిజైన్‌తో వస్తుంది. డిస్‌ప్లేలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. * బ్యాటరీ కెపాసిటీ వన్‌ప్లస్‌ 13లో ఉడెన్‌ కేస్‌లను తిరిగి తీసుకురావడంపై ‘Weibo’ ప్లాట్‌ఫామ్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వన్‌ప్లస్‌ చైనా హెడ్ లూయిస్ లీ స్పందించారు. ఉడెన్‌ కేస్‌లను తీసుకొచ్చే ఆలోచన వన్‌ప్లస్‌కి లేదని స్పష్టం చేశారు. దీనికి బదులుగా ఉడ్‌ గ్రెయిన్‌ ఫోన్‌ కేసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వన‌ప్లస్‌ 13లో ‘మాగ్నెటిక్ సక్షన్ ఫంక్షన్’ కూడా ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100W ఫాస్ట్-వైర్డ్ ఛార్జింగ్‌కి సపోర్ట్‌ చేస్తుందని సమాచారం. * కెమెరా ఫీచర్లు, ప్రాసెసర్ ఈ డివైజ్‌లో ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ ఉంటుంది. దీంట్లో OISతో 50MP LYT-808 మెయిన్‌ కెమెరా, 50MP LYT-600 అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP LYT-600 3x పెరిస్కోప్ లెన్స్‌ ఉంటాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ ఉంటుంది. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ క్వాల్కమ్‌ నెక్స్ట్‌ జనరేషన్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుందని సమాచారం. ఇది 24GB LPDDR5X RAMతో అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత మోడల్‌లో 512GB నుంచి 1TB వరకు స్టోరేజ్‌కి సపోర్ట్‌ చేయనుంది. * ధర ఎంత? ఇప్పటికి వన్‌ప్లస్‌ 13 కచ్చితమైన ధరపై స్పష్టత లేదు. అయితే వన్‌ప్లస్ 12తో పోలిస్తే దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉండవచ్చని టెక్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫోన్ బేస్ 12GB/256GB మోడల్‌ ధర రూ.64,999 ఉండవచ్చని సమాచారం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.