NEWS

Bajaj: బజాజ్ నుంచి మరో కొత్త బైక్.. రేపే పల్సర్ N125 లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

Bajaj Pulsar N125 ఇండియన్‌ ఆటోమొబైల్​ మార్కెట్​లోని 125 సీసీ బైక్​ సెగ్మెంట్‌​లో విపరీతమైన పోటీ ఉంటుంది. హీరో, హోండా, టీవీఎస్, KTM వంటి కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో వీటిని లాంచ్ చేస్తుంటాయి. ప్రముఖ టూ-వీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో (Bajaj Auto) కూడా అట్రాక్టివ్ అప్‌గ్రేడ్స్‌తో సరికొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంది. ఇప్పుడు 125 సీసీ సెగ్మెంట్‌లో ఇంకో కొత్త మోటార్‌సైకిల్ రిలీజ్ చేయనుంది. కంపెనీ రేపే (అక్టోబర్ 17) ఈ కొత్త బైక్‌ను ఇండియాలో లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అయితే బజాజ్ ఇంకా దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. రిపోర్ట్స్ ప్రకారం.. ఈ కొత్త మోటార్‌సైకిట్ ‘బజాజ్‌ పల్సర్ N125’ (Bajaj Pulsar N125) పేరుతో లాంచ్ కావచ్చు. బజాజ్ ఆటో అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఈ బైక్ గురించి ఒక టీజర్ కూడా పోస్ట్ చేసింది. అందులో ఈ మోటార్ సైకిల్ చాలా స్టైలిష్‌గా స్పోర్టీ లుక్‌తో, అగ్రెస్సివ్‌గా కనిపించింది. ఈ బైక్ హ్యాండిల్ బార్స్‌ను స్పోర్ట్స్ బైక్ లాగా డిజైన్ చేశారు. యంగ్‌స్టర్స్‌ కోసమే దీన్ని స్పెషల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. హెడ్‌లైట్ కూడా చాలా స్టైలిష్ లుక్‌తో రానుంది. కంపెనీ ఈ బైక్‌లో పవర్‌ఫుల్ ఇంజన్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు అందిస్తుందని సమాచారం. ఇంజిన్ కెపాసిటీ ఈ కొత్త బజాజ్ పల్సర్ N125లో ఇచ్చిన 125 CC ఇంజన్‌ను బాగా ట్యూన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫలితంగా ఇది ఎక్స్‌ట్రా పవర్ ప్రొడ్యూస్ చేయవచ్చు. ఆటోమొబైల్ వర్గాల ప్రకారం, ఈ ఇంజన్ 11.8 PS, 10.8 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్ స్మూత్, ఎగ్జైటింగ్ రైడ్ ఆఫర్ చేస్తుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంపెనీ షేర్ చేసిన మరొక రీల్ ప్రకారం ట్రాఫిక్‌లో కూడా ఇది పవర్‌ఫుల్‌గా దూసుకుపోతుందని చెప్పారు. ఇనీషియల్‌, మిడ్, టాప్ గేర్స్‌లో ఫుల్ చాలా బాగుంటుందన్నట్టుగా చెప్పారు. అలానే దీనిలో LED లైట్లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ సస్పెన్షన్ వంటి చాలా స్పెషల్ ఫీచర్లు ఉంటాయి. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఇచ్చారని తెలుస్తోంది. ABS బ్రేక్స్ లాక్ కాకుండా చేసి బైక్ స్లిప్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్ప్లిట్ సీట్లు, డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటివి ఈ బైక్‌లోని ఇతర ప్రత్యేకతలు. ధర ఎంత? ఈ బైక్ ధర ఎంత అనేది కంపెనీ అధికారికంగా చెప్పలేదు. కానీ, దీని ధర ఇంచుమించు రూ. 1 లక్ష ఉండొచ్చు. అక్టోబర్ 17న వెహికల్ లాంచ్ అయిన తర్వాతే, ఎన్ని వేరియంట్లలో, ఎంత ధరలతో వస్తుందనేది తెలుస్తుంది. బైక్ కలర్స్ కూడా రేపే తెలిసే అవకాశం ఉంది. దీనికి హోండా షైన్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125, TVS రైడర్ 125 వంటి బైక్స్ పోటీ ఇస్తాయి. 125cc కేటగిరీలో ఎంట్రీ ఇవ్వనున్న దీని పవర్, మైలేజ్ నచ్చితే బైక్ లవర్స్ దీన్ని కొనడానికి మొగ్గు చూపవచ్చు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.