NEWS

Sukanya Samriddhi Scheme: కూతురు పుట్టిందా.. రూ.27 లక్షలు పొందండి, పదేళ్లు వచ్చేలోపు ఇలా చేస్తే చాలు!

కూతురు పుట్టిందా.. రూ.27 లక్షలు పొందండి, పదేళ్లు వచ్చేలోపు ఇలా చేయండి చాలు! మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారా అయితే ఈ స్కీం గురించి తెలుసుకోండి. లేదంటే చాలా నష్టపోతారని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు అంటున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం… పదండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా సబ్ పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇక్కడ అప్పుడే పుట్టిన ఆడపిల్లల నుంచి 10 సంవత్సరాల వయసు గల అమ్మాయిలకు కేంద్రం ప్రవేశపెట్టిన స్కీమును ఈ పోస్టాపీసు నందు అందుబాటులో ఉందని పోస్టల్ ఇన్స్పెక్టర్రాఘవేంద్ర లోకల్ 18 తెలిపారు.ఆ స్కీమ్ ఏమిటంటే సుకన్య సమృద్ధి యోజన పథకం ఏర్పాటు చేశామని ఇందులో చిన్నారులకు ప్రతినెల 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు ఆ పిల్లల పేరు పైన సబ్ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయవచ్చునన్నారు. ఆ తర్వాత ఈ స్కీం కాల వ్యవధి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి అయితే.. వడ్డీతో కలిపి ఎంత మెచ్యూరీటీ అమౌంటు వస్తుందో వారికి ఇస్తారన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరుసుకన్య సమృద్ధి యోజన.ఈ పథకానికి భారతీయ పౌరసత్వం ఉన్నవారు మాత్రమే అర్హులు. ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉంటే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం ఇద్దరి అమ్మాయిలకు వర్తిస్తుందన్నారు.ఈ స్కీమ్ పూర్తిగా 21 సంవత్సరాలు ఉన్నప్పటికీ కంటిన్యూగా 15 సంవత్సరాలు కట్టాలన్నారు.తరువాత ఆరు సంవత్సరాల తరువాత మరలా స్కీమ్ను కట్టే విధంగా ప్రభుత్వం తగు చర్యలు ఏర్పాటు చేసి ఉంది. సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల పేర్ల పై నమోదు చేయటం వల్ల వారికి భవిష్యత్తుకు మంచి భరోసానిచ్చినట్లు ఉంటుందన్నారు.ఈ డబ్బును మొత్తం ఏ అమ్మాయి పేరుతో కడుతుంటామోఆ అమ్మాయికి 21 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మెచ్యురిటి అమౌంటును వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పూర్తి డబ్బునుఅందజేస్తారు. సుకన్య సమృద్ధి యోజన పథకానికి అప్లై చేసుకోవడానికి అప్పుడేపుట్టిన ఆడబిడ్డ జనన పత్రం, మూడు ఫోటోలు,తల్లి లేదా తండ్రి ఆధార కార్డు, వారి ఫోటోలు, రేషన్ కార్డ్, పాన్ కార్డ్స్ అవసరం అవుతాయన్నారు. పదేళ్లలోపు అమ్మాయిలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. సంబంధిత ధృవపత్రాలతోమీ సేవ లేదా మండల పరిషత్ కార్యాలయంలో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అప్లై చేసుకోవచ్చునని రాఘవేంద్ర లోకల్ 18తో తెలిపారు.ఈ పథకానికి ఎలాంటి బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చునన్నారు.అందులోనూ ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నవారి చిన్నారులకు కూడా ఈ స్కీం వర్తిస్తుందన్నారు.కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుందని పోస్టల్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర లోకల్ 18 తో చెప్పారు. నెలకు రూ.5 వేలు చొప్పున కడితే మెచ్యూరిటీలో ఏకంగా రూ. 27 లక్షలు పొందొచ్చు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.