NEWS

Chandrababu - Niti Aayog: ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఈసారి భారీ ప్లాన్!

ఏపీ సీఎం చంద్రబాబు (File - PTI) అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ప్రస్తావిస్తారు. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది ఏపీ సర్కార్. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు చెప్పనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో ఏపీ సీఎం వివరిస్తారని తెలిసింది. అలాగే.. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకు ఉన్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన ప్రస్తావిస్తారని సమాచారం. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్.. చేపట్టనున్న ప్రణాళికలను చంద్రబాబు వివరిస్తారని తెలిసింది. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని సమాచారం. ఇటీవల 500, 100 నోట్లను రద్దు చెయ్యాలని చంద్రబాబు కోరారు. ఇదే వాయిస్ వినిపిస్తూ… డిజిటల్ కరెన్సీ అవసరాన్ని నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు వివరిస్తారని సమాచారం. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ విషయాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం ముందు, తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలుస్తారని తెలిసింది. ఇటీవల చంద్రబాబు తరచూ ఢిల్లీకి వెళ్లి, పెద్దల్ని కలుస్తున్నారు. తద్వారా తాము ఢిల్లీ పెద్దలతో కలిసి సాగుతున్నామనే సంకేతాలు ఇస్తున్నారు. జేడీయూ లాగా తాము అడ్డమైన డిమాండ్లు పెట్టి, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టట్లేదనీ, ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా చేస్తూ, ఏపీకి నిధులు, ఇతర వెసులుబాట్లను స్నేహపూర్వగంగా పొందేందుకు ప్రయత్నిస్తున్నామనే సంకేతాలను చంద్రబాబు ఇస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర బడ్జెట్ తర్వాత కీలక ప్రెస్‌మీట్ పెట్టి.. తాను, మంత్రులూ.. 18 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చామని చెప్పారు. వెళ్లిన ప్రతిసారీ తెలంగాణకు నిధులు, ప్రాజెక్టుల కోసం ప్రయత్నించినట్లు చెప్పారు. ఇలా 7 నెలల్లో రేవంత్ రెడ్డి.. 18 సార్లు వెళ్లారంటే.. నెలకు 2 లేదా 3 సార్లు వెళ్లినట్లే. ఇదే విధంగా చంద్రబాబు కూడా తరచూ ఢిల్లీ వెళ్లడం ద్వారానే ఏపీకి సరైన న్యాయం కలుగుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. తరచూ ఢిల్లీ పెద్దల్ని కలిసి, మాటామంతీ నిర్వహించడం వల్ల, ఢిల్లీ పెద్దలు కూడా ఏపీ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తారని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందువల్ల శనివారం జరిగే నీతి ఆయోగ్ మీటింగ్.. ఏపీ ఫ్యూచర్‌కి కీలకం కాబోతోందని అనుకోవచ్చు. దీని ద్వారా వచ్చే ఫలితాలను చూసుకొని, చంద్రబాబు నెక్ట్స్ ప్లాన్ ఉంటుందని తెలుస్తోంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.